Bank of America: అంబానీ కంపెనీపై అమెరికా బ్యాంక్ కన్ను.. రూ.18,268 కోట్ల భారీ డీల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank of America: ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, అమెరికా దిగ్గజ బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన జియో క్రెడిట్ లిమిటెడ్‌లో 49.9 శాతం వరకు వాటాను సుమారు రూ.18,268 కోట్లకు కొనుగోలు చేసేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా అంగీకరించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ అమెరికా అనుబంధ సంస్థ ఎన్బీ హోల్డింగ్స్ ద్వారా ఈ పెట్టుబడి పెట్టనుంది. ముందుగా ప్రిఫరెన్షియల్ షేర్ కేటాయింపు ద్వారా రూ.6,613 కోట్ల పెట్టుబడితో 4.29 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనుంది. దీంతో జియో క్రెడిట్లో 26.50 శాతం వాటా లభిస్తుంది. అనంతరం రూ.11,655 కోట్ల విలువైన 7.56 కోట్ల వారెంట్లను ఎన్బీ హోల్డింగ్స్ సబ్‌స్క్రైబ్ చేయనుంది. ఈ వారెంట్లను 18 నెలల్లోపు ఈక్విటీ షేర్లుగా మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జియో క్రెడిట్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా వాటా 49.90 శాతానికి చేరుతుంది.
రెండేళ్లలోనే రూ.30,667 కోట్ల ఆస్తులు
జియో క్రెడిట్‌ను సుమారు రెండేళ్ల క్రితమే స్టార్ట్ చేశారు. దీని ద్వారా చిన్న వ్యాపారాలు, రిటైల్ కస్టమర్లకు రుణాలు అందించడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ కంపెనీ ద్వారా గృహ రుణాలను కూడా అందిస్తున్నారు. 2026 జూన్ 30 నాటికి కంపెనీ నిర్వహణలోని ఆస్తులు (AUM) రూ.30,667 కోట్లకు చేరుకున్నాయి. అయితే వ్యక్తిగత రుణాలు, ఎలాంటి హామీ లేకుండా ఇచ్చే రుణాల రంగంలోకి జియో క్రెడిట్ ఇంకా ప్రవేశించలేదు. ఈ రంగాలను గతంలో కీలక లక్ష్యాలుగా పరిగణించినప్పటికీ, ప్రస్తుతం కంపెనీ ఇతర రుణ విభాగాలపై దృష్టి సారిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచ స్థాయి సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్న జియో వ్యూహానికి తాజాగా ఒప్పందం మరింత బలం చేకూర్చనుందని అంటున్నారు. ఇప్పటికే బీమా రంగంలో జర్మనీకి చెందిన అలియాంజ్‌తో, మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో అమెరికాకు చెందిన బ్లాక్‌రాక్‌తో జియో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుంది. ఈ జాయింట్ వెంచర్ ద్వారా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు ఉన్న డిజిటల్ సామర్థ్యాలు, భారత మార్కెట్‌పై అవగాహనతో పాటు బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రపంచవ్యాప్త ఆర్థిక సేవల నైపుణ్యం తోడు కానుంది. అయితే ఇది బ్యాంక్ ఆఫ్ అమెరికా భారత రిటైల్ రుణ వ్యాపారంలోకి నేరుగా ప్రవేశిస్తున్నట్లు భావించకూడదని సంస్థ అధికారులు స్పష్టం చేశారు.
Also Read
- Bima Sakhi: 10th పాసైన మహిళలకు నెలకు రూ.7,000.. LIC బంపరాఫర్! పూర్తి వివరాలు ఇవే..
- Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
- Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
- DA Hike 2026: జీతం, పెన్షన్, బకాయిలు.. 3% డిఏ/డిఆర్ పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
భారత్‌పై BofA భారీ నమ్మకం
ఈ ఒప్పందంపై ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే విస్తృతమైన, విశ్వసనీయమైన, అందరికీ అందుబాటులో ఉండే ఆర్థిక వ్యవస్థ అవసరమన్నారు. టెక్నాలజీ, ప్రపంచ స్థాయి నైపుణ్యాల సహాయంతో భారతీయులకు రుణ సేవలను మరింత సింపుల్‌గా, పారదర్శకంగా అందించడంలో ఈ ఒప్పదం కీలక ముందడుగని పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా సీఈఓ బ్రయాన్ మోయ్నిహాన్ మాట్లాడుతూ.. భారత్ ప్రపంచంలో అత్యంత కీలకమైన వృద్ధి మార్కెట్లలో ఒకటని అన్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తక్కువ సమయంలోనే గణనీయమైన స్థాయికి చేరుకుందని, రెండు కంపెనీల బలాలు కలిస్తే ఆర్థిక సేవల వినియోగం మరింత విస్తరించడంతో పాటు భారత ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని తెలిపారు.
తాజావార్తలు
-
Rajasthan: 40 విల్లాలు, కాటేజీలు.. IAS-IPS దంపతుల అవినీతి బాగోతం..
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డులు.. భారత క్రికెట్లో మరో కొత్త చర్చ..
-
I Am Game: జియోహాట్‌స్టార్‌లోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
-
Bima Sakhi: 10th పాసైన మహిళలకు నెలకు రూ.7,000.. LIC బంపరాఫర్! పూర్తి వివరాలు ఇవే..
-
Nvidia: చైనాకు AI చిప్స్ అక్రమ రవాణా.? ఎన్విడియా సీఈఓ సన్నిహితురాలిపై అనుమానం..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!