CAA: ‘‘ఇది మాకు రామరాజ్యం’’..సీఏఏపై పాక్ హిందూ శరణార్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CAA: కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని నోటిఫై చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వాన్ని ఇచ్చే ఈ చట్టాన్ని 2019లో పార్లమెంట్ ఆమోదించింది. అయితే, సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కేంద్రం చట్టాన్ని అమలు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. పలు రాజకీయ పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మాత్రం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తోంది.
Read Also: Kangana Supports CAA: మోడీని మరో సారి ఆకాశానికి ఎత్తిన కంగనా రనౌత్.. సీఏఏకు పూర్తి మద్దతు
Also Read
దీని ప్రకారం డిసెంబర్ 31, 2014కంటే ముందు భారత్‌కి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, క్రిస్టియన్, సిక్కు, పార్సీ, జైన, బౌద్ధ మతస్తులకు భారత పౌరసత్వం రానుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పాక్ నుంచి ఇండియాకు వచ్చిన హిందువులు హర్షిస్తున్నారు. రాజస్థాన్ జోధ్‌పూర్ వారంతా వేడుకలు నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఇది మాకు నిజమైన రామరాజ్యం లాంటిది’’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
‘‘మేము దీని కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాము. ఇది (CAA) నిజం కావడంతో, పౌరసత్వం కోసం చూస్తున్న చాలా మంది త్వరలో భారతీయ పౌరులుగా మారాలని ఆశిస్తున్నారు’’ అని పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ వలసదారు దినేష్ భీల్ అన్నారు. భారత్‌లో నివసించిన ఆరు ఏళ్ల తర్వాత మేము పౌరసత్వం పొందుతున్నామని మరో వలసదారు పెరుమాళ్ అన్నారు. ఒక్క జోధ్‌పూర్ లో సుమారు 35,000 మంది వలసదారులు పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. గత 10 ఏళ్లలో పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి హిందూ వలసదారుల ప్రవాహం పెరిగింది. పాకిస్తాన్ లోని సింధ్ నుంచి హిందూ వలసదారులు రాజస్థాన్ లోని బార్మర్, బికనేర్, జోధ్‌పూర్‌లకు వచ్చి నివసిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు