రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన నలుగురు పిల్లలను తానే వాటర్ ట్యాంక్‌లో పడేసింది. అనంతరం ఆమె కూడా ట్యాంక్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.
Rajasthan : రాజస్థాన్‌లోని ధోల్పూర్లోని ప్రత్యేక కోర్టు పోక్సో చట్టం కింద ఓ యువకుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.65 వేలు జరిమానా కూడా విధించారు.
kidney Operation: రాజస్థాన్‌లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలోని జుంజునులో కిడ్నీలో రాళ్లు ఉండటంతో మహిళను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
ఉత్తర భారత్‌ను తీవ్రమైన వడగాలులు హడలెత్తిస్తున్నాయి. గత కొద్ది రోజులు ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. దీంతో బయటకురావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీంతో వృద్ధులు, పిల్లలు బెంబేలెత్తిపోతున్నారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో.. జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో వేడిగాలులు వీచాయి. కాగా.. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్‌లలోని కనీసం 16 ప్రదేశాలలో గురువారం గరిష్టంగా 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడి గాలులు కనీసం ఐదు రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ…
తన భార్యను, ప్రేమికుడిని ఓ చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన రాజస్థాన్‌లోని బన్స్వారాలో చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. అయితే.. భర్తను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
దేశ రక్షణలో జవాన్ల పాత్ర ఎనలేనిది. సరిహద్దుల్లో ఎండా.. వాన.. చలికి సైతం తట్టుకుంటూ నిలబడతారు. మాతృభూమిని శత్రువుల దాడి నుంచి కాపాడేందుకు సైన్యం చేస్తున్న త్యాగాలు మరువలేనివి. సరిహద్దుల్లో ఎప్పుడు ఎలా శత్రువు దాడిచేస్తాడో తెలియదు.
రాజస్థాన్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫోన్ ఎక్కువగా వాడుతుందని కూతురిని తల్లి రాడ్‌తో కొట్టి చంపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. 22 ఏళ్ల నికితా సింగ్, బిందాయక ప్రాంతంలో నివాసం ఉంటోంది. అయితే.. ఆమె పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంది. అయితే చదువుకోవడం మానేసి నికితా ఎక్కువ సమయం ఫోన్లో గడిపేదని, అందుకే ఆమె ఫోన్ ను రెండున్నర నెలల క్రితం తీసుకున్నట్లు ఆమె తండ్రి తెలిపారు.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ ఉపాధ్యాయుడు తన ఇంట్లో సమస్యలను దూరం చేసుకోవాలనుకున్నాడు. పరిష్కారం కోసం ఒక తాంత్రికుడి వద్దకు వెళ్లాడు. అయితే.. ఆ తాంత్రికుడు తన ఆస్తులన్నీ కాజేశాడు. దీంతో.. బాధితుడు ఆస్తులు, తన కుటుంబాన్ని రెండింటిని కోల్పోయాడు. కాగా.. ఈ ఘటనలో బాధితుడు భార్య సుష్మా దేవదా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాంత్రికుడు, అతని కుమారుడు సహా నలుగురిపై కేసు పెట్టింది. ఈ వ్యవహారం 2023లో మొదలు కాగా.. పోలీసులు విచారణ చేపట్టారు.
బాలికపై హత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు మరణశిక్ష విధించింది. రాజస్థాన్‌లోని భిల్లారా జిల్లాలో ఫోక్సో కోర్టు ఈ మరణశిక్ష విధించింది.