సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ప్రధాని మోడీ, బీజేపీ నేతలంతా ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా గెలవబోతుందని చెప్పుకొచ్చారు. తీరా రిజల్ట్ వచ్చాక… అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఇక ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్న ప్రాంతాల్లో కూడా పువ్వు పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అందులో ప్రధానంగా యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలు ప్రముఖంగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: BJP: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ రాజీనామా..?
రాజస్థాన్‌లో కమలం పార్టీ ఓడిపోవడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి. జాట్‌ల అసంతృప్తి, గుజ్జర్ల మార్పు, టిక్కెట్ల పంపిణీ, ముఖ్య నేతలను పక్కన పెట్టడం వంటి అనేక సంస్థాగత వైఫల్యాలు కారణంగా కనిపిస్తున్నాయి. రాజస్థాన్‌లోని 25 లోక్‌సభ స్థానాలు ఉండగా 11 స్థానాల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ స్థానాల్లో జాట్‌ల ఆగ్రహం పెద్ద దెబ్బగా కనిపించింది. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను పక్కన పెట్టడం కూడా పార్టీ నష్టానికి మరో పెద్ద కారణంగా చెప్పొచ్చు.
ఇది కూడా చదవండి: AP CEO MK Meena: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు నిలుపుదల
దాదాపు ఆరు నెలల క్రితం.. అనగా డిసెంబర్ 2023లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 199 స్థానాలకు గాను 115 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్‌లాల్ శర్మ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు జరిగింది. అయితే ఆయన సారథ్యంలో రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను 11 స్థానాల్లో ఓటమితో కాషాయ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. గతంలో 2014లో బీజేపీ మొత్తం 25 సీట్లు సొంతంగా గెలిచి.. మళ్లీ 2019లో రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పీ)తో పొత్తు పెట్టుకుని గెలుపొందింది.
ఇది కూడా చదవండి: Ajit Pawar: అజిత్ పవార్‌కి షాక్.. కీలక సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరు..