నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NEET UG పరీక్ష 2024 ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది 67 మంది విద్యార్థులు టాపర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ పరీక్షలో రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌కు చెందిన ఇషా కొఠారి మొదటి ర్యాంక్ సాధించింది. ఇషాకు 720 మార్కులకు గాను 720 మార్కులు వచ్చాయి. ఆల్ ఇండియా వన్ ర్యాంక్ సాధించిన తర్వాత ఇషా, ఆమె కుటుంబం ఆనందానికి అవధులు లేవు. ఇంత మంచి మార్కులు సాధించిన తర్వాత, ఇషా ఇప్పుడు తనకు నచ్చిన ఏదైనా ప్రఖ్యాత మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్ పొందవచ్చు. తాను ప్రతిరోజూ 7 గంటలు తన చదువుకు కేటాయిస్తానని, ఏదైనా అంశం క్లియర్ అయ్యే వరకు వదిలిపెట్టనని ఇషా చెప్పింది.
READ MORE: India Alliance: లోక్ సభా ఎన్నికలలో సీట్లు మరియు ఫలితాలు
ఆల్ ఇండియాలో టాప్ ర్యాంక్ సాధించిన తర్వాత, ఢిల్లీలోని AIIMS నుంచి డాక్టర్ కావాలని కలలు కంటుంది ఇషా. మధ్యాహ్నం ఫలితాలు వచ్చే సరికి ఇషా నిద్రపోతున్న తల్లిదండ్రులు ఫలితాలు చూసి ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేవు. ఇషా తన విజయానికి తన తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు క్రెడిట్ ఇచ్చింది. ఇషా వయస్సు కేవలం 17 సంవత్సరాలు. ఆమె చదువులో చాలా వేగంగా ఉంటుంది. ఇషా తండ్రి ప్లైవుడ్ వ్యాపారం చేస్తుంటారు. ఇషా ఎమ్‌డిఎస్ స్కూల్, రేడియంట్ కోచింగ్ సెంటర్ నుంచి నీట్ పరీక్షకు సిద్ధమైంది. 720కి 720 మార్కులు రావడం పట్ల ఇషా చాలా సంతోషంగా ఉందని, ఎట్టకేలకు తన కష్టానికి ఫలితం దక్కిందని చెప్పింది. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా చదువుకున్నానని ఇషా తల్లి హంసా కొఠారి తెలిపారు. ఆమెకు చాలా పరిమిత సంఖ్యలో స్నేహితులు ఉన్నారని.. చదువుపై మాత్రమే దృష్టి పెడుతుందన్నారు. దేశంలోనే టాప్ ర్యాంక్‌లో ఉన్న మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లాలన్న తన కలను నెరవేర్చుకోబోతున్న ఇషా.. భవిష్యత్తు గురించి చింతించకుండా రెగ్యులర్‌గా చదువుకోవడమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. చదువుల గురించి ఒత్తిడికి గురి కాకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి.