రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజునే తొలి ఏకగ్రీవ ఎన్నిక నమోదు అయింది. రుద్రంగి మండలంలోని రూపులా తండాలో సర్పంచ్ పదవికి జవహర్ లాల్ నాయక్‌ను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.
కార్తీక మాసం సందర్భంగా భక్తులు శివాలయాల్లో విశిష్ట పూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడలో కొలువైన శ్రీ రాజ రాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. కాగా రాజన్న ఆలయంలో కళ్యాణం అర్జిత సేవ టికెట్ల కోసం భక్తులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. స్వామి వారి నిత్య కళ్యాణం కోసం భక్తులు అర్ధరాత్రి నుండే టికెట్ కౌంటర్ వద్ద ఎముకలు కొరికే చచలిలో పడిగాపులు కాస్తున్నారు. మూడు రోజులుగా…
Online Betting: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ పెద్దూరు గ్రామంలో ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ గ్రామానికి చెందిన ప్రణయ్ అనే యువకుడిని బెట్టింగ్ ముఠా ఉచ్చులోకి లాగి భారీ మొత్తంలో వసూళ్లు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రణయ్ గత కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో పాల్గొంటున్నాడని, దీనిని ఆసరాగా తీసుకున్న బెట్టింగ్ ముఠా సభ్యులు అతడిపై బెదిరింపులకు దిగినట్లు సమాచారం. కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి దాదాపు…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూలవాగు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ తెప్ప వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.v
Snake Surgery: రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా పాముని చూస్తే ప్రజలు భయంతో దూరంగా పారిపోతారు. కానీ, ఈసారి మాత్రం చంద్రంపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, గాయపడిన పాముని ప్రాణాలు కాపాడాలని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. గ్రామంలో ఒక ఇంటి లోపలికి చొరబడిన పాముకి ఏదో పదునైన వస్తువు తగలడంతో తీవ్రంగా గాయపడింది. గాయం వల్ల పాముకి పొట్ట చీలి, లోపలి గాల్‌బ్లాడర్, పేగులు బయటకు వచ్చాయి. ఏ…
దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. కోడె మొక్కులు తీర్చుకుని తమ కష్టాలను తీర్చమని శివయ్యను వేడుకుంటారు. అయితే రాజన్న ఆలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఎందుకంటే?.. ఈనెల 7న చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం మూసివేయనున్నట్లు తెలిపారు. 7వ తేది ఆదివారం ఉదయం 11.25 గంటల నుంచి 8వ తేది సోమవారం ఉదయం తెల్లవారు జామున ఉదయం 3.45 గంటల వరకు…
వరకట్నం తీసుకోవడం నేరం.. అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా మార్పు మాత్రం రావడం లేదు. అక్కడితో ఆగుతున్నారా అంటే.. అదీ లేదు. పెళ్లైన కొన్ని రోజులకే అదనపు కట్నం కోసం భార్యలను వేధిస్తూ మానసిక వేదనకు గురిచేస్తున్నారు కొందరు భర్తలు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పెళ్లైన కొన్ని రోజులకే అదనపు కట్నం కోసం వేధిస్తూ తనను ఇంట్లో నుంచి గెంటి వేశాడని ఓ భార్య ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త…
Suicide : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముదిరాజ్ వీధికి చెందిన దీటి రోహిత్ (23) అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు ముందు రోహిత్ ఓ సూసైడ్ నోట్ రాసి ఉంచాడు. అందులో అతను వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు, విఫలమైన ఆశల గురించి విచారం వ్యక్తం చేశాడు. “నీ కొడుకు అయితే వాని…
వివాహేతర సంబంధం కారణంగా ప్రతి రోజు దేశంలో ఎందరో ఆత్మహత్య చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలతో మనస్తాపం చెంది భార్య లేదా భర్త చనిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ‘ప్రియుడితోనే ఉంటా, నువ్ చచ్చిపో’ అని భార్య అనడంతో మనస్తాపం చెందిన భర్త.. వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో బోయినపల్లి మండలం తడగొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల ప్రకారం… తడగొండకు చెందిన హరీశ్ (36)కు కరీంనగర్…
Tragedy : జీవితంలోని విషాదం ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. పుట్టింట్లో బంధువుల కార్యక్రమానికి వచ్చిన ఓ చిన్నారి, ఇంటి ముందు ఆడుకుంటూ విషపూరిత పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. కామారెడ్డి జిల్లాకు చెందిన వలిదాసు కృష్ణయ్య-లలిత దంపతుల పెద్ద కుమార్తె స్నేహాన్షి…