Snake Surgery: రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా పాముని చూస్తే ప్రజలు భయంతో దూరంగా పారిపోతారు. కానీ, ఈసారి మాత్రం చంద్రంపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, గాయపడిన పాముని ప్రాణాలు కాపాడాలని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. గ్రామంలో ఒక ఇంటి లోపలికి చొరబడిన పాముకి ఏదో పదునైన వస్తువు తగలడంతో తీవ్రంగా గాయపడింది. గాయం వల్ల పాముకి పొట్ట చీలి, లోపలి గాల్‌బ్లాడర్, పేగులు బయటకు వచ్చాయి. ఏ క్షణానా చనిపోతుందేమోనన్న స్థితిలో ఆ పాము కనిపించింది.
TSPSC Group-1 Final Results: గ్రూప్-1 ఉద్యోగాల ఫైనల్ ఫలితాలు విడుదల.. 562 అభ్యర్థుల ఎంపిక
ఆ పరిస్థితిలో ఆ ఇంటి యజమాని వెంటనే సిరిసిల్ల పట్టణానికి చెందిన పశువైద్యాధికారి డాక్టర్ అభిలాష్ ను సంప్రదించారు. ఆశ్చర్యకరంగా, ఆ డాక్టర్ పాముని పేషెంట్‌లా ట్రీట్ చేసి ప్రాణాలు నిలబెట్టాడు. డాక్టర్ అభిలాష్ జాగ్రత్తగా బయటకు వచ్చిన పేగులు, గాల్‌బ్లాడర్‌ను తిరిగి సరి చేసి.. ఆ తర్వాత ఆరు అంగుళాల పొడవు స్టిచ్‌లు వేసి ఆపరేషన్ పూర్తి చేశారు. శస్త్రచికిత్స తర్వాత పాముని మూడు రోజులపాటు అబ్జర్వేషన్‌లో ఉంచి ప్రత్యేకంగా మందులు, ఇంజెక్షన్లు వేసి చికిత్స చేశారు. మూడు రోజుల తర్వాత పాము పూర్తిగా కోలుకోవడంతో, దాన్ని మళ్లీ స్థానిక అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
Ind vs Ban : ఆసియా కప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా
ఈ ఘటన చూసిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. మనుషులకే కాదు, పాముకి కూడా ఇలా ఆపరేషన్ చేసి బతికించగలరా? అంటూ విస్మయపడ్డారు. పాము దగ్గరకు ఎవరైనా వెళ్లడానికి కూడా భయపడతారు. కానీ వెటర్నరీ డాక్టర్ అభిలాష్ మాత్రం ప్రాణం ఉన్న జంతువంటే కాపాడాలన్న దృక్పథంతో చికిత్స చేశారు. జంతువుల పట్ల కరుణ, ప్రేమ ఉంటే, ఏ జీవినైనా కాపాడగలం అనే సందేశాన్ని ఈ ఘటన తెలియజేస్తుంది. గాయపడిన పాముకి ఆపరేషన్ చేసి ప్రాణం నిలబెట్టడం.. మానవత్వానికి ప్రతీకగా నిలిచే పని అంటూ డాక్టర్ కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ అభిలాష్ చేసిన ఈ ఆపరేషన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.