Saddula Bathukamma: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూలవాగు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ తెప్ప వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మహిళలు ఉత్సాహంగా బతుకమ్మలను తెప్పపై ఉంచి పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ వేడుకలను సందడిగా మార్చారు. మూలవాగులో మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేస్తూ ఆనందోత్సవాలు జరుపుకున్నారు. దీంతో మూలవాగు ప్రాంతం మొత్తం బతుకమ్మ పాటలతో, రంగురంగుల వాతావరణంతో కళకళలాడింది. వేడుకలు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా సాగేందుకు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 100 మంది పోలీసులను నియమించి బందోబస్తు నిర్వహించారు.


Tamil nadu: తమిళనాట ఘోర విషాదం.. విజయ్ ర్యాలీలో 30 మందికి పైగా మృతి..