టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా కమలం పార్టీకి 10 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. దీంతో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన మంగళవారం ఉదయం రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది.
నిన్న ( ఆదివారం ) ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలేదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. చిలకలూరిపేటలో జరిగిన టీడీపీ- బీజేపీ- జనసేన ఉమ్మడి సభ ఫ్లాప్ అయిందని ఆరోపించారు.
రాజకీయంగా బహుజనులు చైతన్యవంతులైనప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీ మార్గాని భరత్ రామ్, రాజమండ్రి లోక్సభ వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితర బీసీ సామాజిక ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రాజమండ్రి వీఎల్ పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో 'శెట్టిబలిజ, గౌడ ఆత్మీయ సమ్మేళనం' నిర్వహించారు. ఈ సభకు ఎంపీ భరత్ అధ్యక్షత వహించారు. రాజమండ్రి అర్బన్, రూరల్, రాజమండ్రి లోక్సభ స్థానాలను బీసీలకే సీఎం జగన్ కేటాయించడం శుభపరిణామమని మంత్రి చెల్లుబోయిన…
దక్షిణ కాశీగా పేర్గాంచిన రాజమండ్రి పవిత్ర గోదావరి పుష్కర్ ఘాట్ నుంచి అయోధ్య బాల రాముని దర్శనానికి బైక్స్ పై బయల్దేరుతున్న యువకులిద్దర్నీ ఎంపీ మార్గాని భరత్ అభినందించారు. వారి ప్రయాణం దిగ్విజయంగా కొనసాగాలని కోరారు..
Rajahmundry MP Margani Bharath Comments: గుంటనక్కలు కాసుకుని కూర్చున్నారని, ప్రజలు గమనించి ఓటేయాలని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రేపు రాజమండ్రిలో లోకల్గా సిద్దం కార్యక్రమాన్ని సుబ్రమణ్యం మైదానంలో ఏర్పాటు చేశామని, రాజమండ్రి ప్రజల అభివృద్ధికి తాము సిద్దం అని అన్నారు. 10 వేల మందితో సిద్దం సభ జరగబోతోందన్నారు. రాజమండ్రిలో టీడీపీ చేసిన ఒక అభివృద్ధి చెప్తారా?, 16 ఏళ్లు పదవిలో ఉండి ఏ సాధించాలో చెప్పాలి అని ఎంపీ మార్గాని భరత్ అన్నారు.…
నేడు రెండో రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించనున్నారు. నేటి ఉదయం 10 గంటల నుంచి రాజమండ్రి ఏవీఏ రోడ్ లో ఉన్న జనసేన పార్లమెంటు కార్యాలయంలో సమావేశాలు జరగనున్నాయి.