Rajahmundry MP Margani Bharath Comments: గుంటనక్కలు కాసుకుని కూర్చున్నారని, ప్రజలు గమనించి ఓటేయాలని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రేపు రాజమండ్రిలో లోకల్‌గా సిద్దం కార్యక్రమాన్ని సుబ్రమణ్యం మైదానంలో ఏర్పాటు చేశామని, రాజమండ్రి ప్రజల అభివృద్ధికి తాము సిద్దం అని అన్నారు. 10 వేల మందితో సిద్దం సభ జరగబోతోందన్నారు. రాజమండ్రిలో టీడీపీ చేసిన ఒక అభివృద్ధి చెప్తారా?, 16 ఏళ్లు పదవిలో ఉండి ఏ సాధించాలో చెప్పాలి అని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. పేదరికాన్ని కొలమానంగా చేసుకుని సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారన్నారు. డ్వాక్రా, రైతు రుణమాఫీ అని మాయమాటలు చెప్పి బాబు మోసం చేసాడు.. బాబొస్తే జాబొస్తుందని నమ్మించి నిరుద్యోగులను మోసం చేయలేదా? అని మార్గాని భరత్ ప్రశ్నించారు.
ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ… ‘చంద్రబాబు అండ్ కో నయా డ్రామా ప్రారంభించారు. ధర్మయుద్దం అంటూ చంద్రబాబు గత ఎన్నికల ముందు బీజేపీ, నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసారు. అమిత్ షా తిరుపతి వస్తే చెప్పులు విసిరించాడు. ఇంత చేసి బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకోడానికి సిద్దమయ్యారు. పవన్ కళ్యాణ్ ను దూతలా పంపిస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా ధర్మపోరాటం అంటున్నారు, డ్వాక్రా, రైతు రుణమాఫీ అని మాయమాటలు చెప్పిమోసం చేసాడు. బాబొస్తే జాబొస్తుందని నమ్మించి నిరుద్యోగులను మోసం చేయలేదా?. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులలో జగన్ ప్రత్యేక సంపాదించారు. పేదరికాన్ని కొలమానంగా చేసుకుని జగన్ పరిపాలన సాగిస్తున్నారు’ అని అన్నారు.
Also Read: Mylavaram Ticket: వసంత ఎంట్రీతో మైలవరంలో ఆసక్తికర పరిణామాలు.. కలిసిపోయిన దేవినేని, బొమ్మసాని!
‘2019లో టీడీపీని చంద్రబాబు పెట్టింది కాదు.. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ. ఆ క్షోభతోనే ఎన్టీఆర్ చనిపోయాడని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబుతో చేతులు కలిపి బీజేపీ కోసం పాకులాడుతున్నాడు. ప్రజలే రేపటి కురుక్షేత్ర యుద్దంలో వైసీపీని గెలిపిస్తారు. గుంటనక్కలు కాసుకుని కుర్చున్నారు, ప్రజలు గమనించి ఓటేయాలి. రేపు రాజమండ్రిలో సిద్దం కార్యక్రమాన్ని సుబ్రమణ్యం మైదానంలో ఏర్పాటు చేసాం. రాజమండ్రి ప్రజల అభివృద్ధికి మేం సిద్దం. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాడ్, రౌడీ మూకలను అణిచివేసేందుకు సిద్దంగా ఉన్నాం. మాజీమంత్రులు కొడాలి నానీ, పేర్నీ నానీ, మంత్రి వేణు, పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరవుతారు. 10 వేల మందితో సిద్దం సభ జరగబోతోంది. రాజమండ్రిలో టీడీపీ చేసిన ఒక అభివృద్ధి చెప్తారా?. 16 ఏళ్లు పదవిలో ఉండి ఏ సాధించాలో చెప్పాలి. రాజమండ్రిలో అభివృద్ధి జరిగితేనే నాకు ఓటు వేయండి. రాజకీయాలను అడ్డుపెట్టుకుని అధిక వడ్డీలతో వందల కోట్లు కొట్టేసారు. బ్లేడ్ బ్యాచ్, రౌడీ ఇజాన్ని పెంచి పోషిస్తున్నది టీడీపీ. మేం అధికారంలోకి వస్తే అన్ని అణచివేస్తాం’ అని ఎంపీ చెప్పుకొచ్చారు.