కార్తికమాసంలో తొలి సోమవారం ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని చెబుతారు.. ఈ సందర్భంగా గోదావరి నది భక్తులతో కిటకిటలాడుతోంది.. కార్తిక మాసంలో మొదటి సోమవారం కావడంతో రాజమండ్రిలో స్నానఘట్టాలు భక్తుల పుణ్యస్నానాలతో కిటకిటలాడుతున్నాయి.
బీసీలను నిర్లక్ష్యం చేస్తూ, వారికి అన్యాయం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదని వివిధ పార్టీలకు చెందిన బీసీ నాయకులు వ్యాఖ్యానించారు. రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
అంబటి రాయుడు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చే విషయమై ఆలోచిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతా పర్యటిస్తున్నానని అతడు చెప్పారు. 2024 ఎన్నికల్లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Ambati Rayudu Hails Yuvatha-Haritha programme in AP: సాంస్కృతిక రాజధాని రాజమండ్రి నగరంలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో హరిత నగరాన్ని తలపిస్తోందని, అద్భుత నగరంగా ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘యువత-హరిత’ కార్యక్రమానికి రాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమండ్రి తిలక్ రోడ్లో నూతనంగా నిర్మించిన డివైడర్లలో ఎంపీ భరత్తో కలిసి…
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు కీలక ప్రకటన చేసింది. నేడు విజయదశమి సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాకాత్ లకు సెలవు ప్రకటించింది. ఈరోజు సెలవుకు సంబంధించి నోటీసులను జైలు అధికారులు జారీ చేశారు. ఈ విషయాన్ని గ్రహించి ఖైదీలు, రిమాండ్ ఖైదీల కుటుంబ సభ్యులు సహకరించాలని జైలు అధికారులు కోరారు.
రాజమండ్రిలో జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ మీటింగ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన జరుగుతుంది. సమావేశానికి జనసేన, టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్లో ఈ సమావేశం జరుగుతుంది. సీట్లు, ఓట్లు పక్కనబెట్టి పోరాటంపై దృష్టి పెట్టేందుకు ఈ భేటీ నిర్వహించారు.
నేడు టీడీపీ-జనసేన పార్టీల తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అవుతుంది. రాజమండ్రిలో మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల అధ్యక్షతన ఈ తొలి జేఏసీ సమావేశం జరుగనుంది.
రేపు టీడీపీ-జనసేన పార్టీల తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అవుతుంది. రాజమండ్రిలోనే సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల అధ్యక్షతన టీడీపీ- జనసేన తొలి జయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది.