ఈ నెల 23వ తేదీన రాజమండ్రిలో తెలుగు దేశం- జనసేన పార్టీలు తొలిసారి సమావేశం కానున్నాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల అధ్యక్షతన టీడీపీ- జనసేన తొలి జయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది.
నవ్వుల రారాజు, ప్రముఖ సినీ హాస్యనటుడు రాజబాబు 87వ జయంతి వేడుక రాజమండ్రి గోదావరి గట్టున ఉన్న రాజబాబు విగ్రహం దగ్గర ఘనంగా జరిగింది. రాజబాబు సోదరుడు బాబి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జయంతి కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.
హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ప్రొఫెషనల్స్ కార్ల ర్యాలీ తీశారు. నేడు (ఆదివారం) తెల్లవారుజాము నుంచే ఈ ర్యాలీ స్టార్ట్ అయింది. కారులతో సంఘీభావ యాత్ర అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఓయ్ ముద్దపప్పు.. నోరు లేస్తోంది.. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు.. కాస్త నోరు అదుపులో పెట్టుకో' అంటూ వైసీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.