Adireddy Srinivas: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న ఆగ్రహం కారణంగా నాకు భారీ మెజార్టీ రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్.. తిలక్ రోడ్డులోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, తన నివాసంలో సర్వమత ప్రార్ధనల అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. తిలక్ రోడ్డు నుంచి శ్యామలానగర్, గోరక్షణపేట, జాంపేట, దేవీచౌక్ మీదుగా గోకవరం బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి భారీగా ర్యాలీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్ధిని దగ్గుబాటి పురంధేశ్వరిలతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్వో కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు..
Read Also: Panipuri : పానీపూరిని ఇష్టంగా లాగిస్తున్నారా?అయితే తస్మాత్ జాగ్రత్త..
ఇక, ఆదిరెడ్డి వాసుతో పాటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కూడా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు రాజమండ్రి చరిత్రలో లేనివిధంగా నా నామినేషన్ కు కార్యకర్తలు తరలివచ్చారని తెలిపారు ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం ఇవాళ నామినేషన్ సందర్భంగా కనిపించింది.. 50 వేలకు పైగా మెజార్టీతో కూటమి అభ్యర్థిగా విజయం సాధించబోతున్నారు.. సీఎం జగన్ పై ఉన్న ఆగ్రహం కారణంగానే నాకు భారీ మెజార్టీ రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదిరెడ్డి శ్రీనివాస్..