Renu Desai: అఖిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్!
- అఖిరా నందన్ సినీ ఎంట్రీపై నేను ఆత్రుతగా ఎదురుచూస్తున్నా
- గోదావరి జిల్లా లాంటి అందమైన లొకేషన్స్ ఎక్కడా చూడలేదు
- చిన్నప్పటి నుంచి మూగజీవాల సంరక్షణ పట్ల ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖిరా నందన్ సినిమాల్లోకి రావాలని తానూ కోరుకుంటున్నానని సినీనటి రేణు దేశాయ్ అన్నారు. ఓ తల్లిగా అఖిరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడా? అని ఆత్రుతగా ఉందన్నారు. అకిరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి వస్తాడన్నారు. గోదావరి జిల్లా లాంటి అందమైన లొకేషన్స్ తాను ఎక్కడ చూడలేదని ఆనందోత్సాహం వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని అందాలు చూడ్డానికి రెండు కళ్లు సరిపోలేదని సంతోషం వెలిబుచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురంలో ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్‌లో ఐదు రకాల కొత్త ఉత్పత్తులను రేణు దేశాయ్ ప్రారంభించారు. అనంతరం రాజానగరంలో రేణు దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ… ‘గోదావరి జిల్లా లాంటి అందమైన లొకేషన్స్ నేను ఎక్కడ చూడలేదు. విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని అందాలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు. తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పెద్దలు నిర్ణయించడం సంతోషం. ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే నాకు సంతోషమే. నాకు చిన్నప్పటి నుంచి మూగజీవాల సంరక్షణ పట్ల ఆసక్తి ఉంది, సామాజిక సేవా కార్యక్రమాల కోసం నా కుమార్తె ఆద్య పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశా’ అని అన్నారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
‘ప్రొడక్ట్‌ను నమ్మితేనే నేను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటా. దక్షిణ భారతదేశ ప్రజలకు ఇడ్లీ, ఉప్మా కంటే మంచి ఆహారం మరొకటి లేదు. ఫారెన్ ఆహారాలు కంటే ఆంధ్ర పెసరట్టు చాలా మేలు. నరేంద్రపురంలో ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్‌లో ఐదు రకాల కొత్త ఉత్పత్తులను ప్రారంభించడం సంతోషంగా ఉంది’ అని రేణు దేశాయ్ చెప్పారు. అఖిరా నందన్ సినీ ఎంట్రీపై మాట్లాడుతూ.. ఓ తల్లిగా తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని చెప్పారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!