Delhi to Rajahmundry Direct Flight: రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి న్యూఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభమైంది. న్యూఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంది మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్.. తొలి విమాన సర్వీసులో ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి వచ్చారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.. ఇక, రన్ వే పై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్ కు వాటర్ కెనాల్స్ తో ఎయిర్ పోర్ట్ సిబ్బంది స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విమాన ప్రయాణం విషయంలో డబ్బు కంటే సమయం గురించి ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు. రానున్న ఐదేళ్లలో దేశంలో 50 కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయని వెల్లడించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో విమానాశ్రయాలు 74.. కానీ, ఇప్పుడు దేశంలో విమానాశ్రయాలు సంఖ్య 158కి పెరిగిందని తెలిపారు.. త్వరలో రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నూతన టెర్మినల్ భవనం కూడా పూర్తి చేస్తామని అన్నారు. ఢిల్లీ ప్లైట్ లో నేరుగా.. రాజమండ్రి వాసులతో సంతోషం పంచుకునేందుకు వచ్చాను అన్నారు రామ్మోహన్ నాయుడు.. ఇవాళ పార్లమెంట్ సెషన్స్ , కేంద్ర కేబినెట్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో.. తిరిగి అదే ఫ్లైట్‌లో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు..