పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, వివేక్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అని తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే దేశ వ్యాప్తంగా 5 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. రైతులకు మేలు చేసే స్వామినాథన్ సిఫార్సుల మేరకు రైతు గ్యారంటీ ఉంటుంది.. ఏడాది పాటు నిరసన వ్యక్తం చేసిన 72 మంది రైతుల ప్రాణాలు పోయిన తర్వాత నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంది బీజేపీ అని శ్రీధర్ బాబు విమర్శలు గుప్పించింది.
Read Also: Janvikapoor : బ్యాచిలరేట్ పార్టీలో రచ్చ చేసిన జాన్వీ.. ఓ ట్విస్ట్ కూడా..
నిరుద్యోగులకు నైపుణ్యాలు పెంచుకునేందుకు ఏటా లక్ష రూపాయలు ఇచ్చే కాంగ్రెస్ కావాలా? హామీలు ఎగ్గొట్టిన బీజేపీ కావాలా? అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మహిళలకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించే మహిళా గ్యారేంటీలు హామీ ఇస్తున్నాం.. బీజేపీ వాళ్ళు గ్యారంటీల అమలు గురించి అడుగుతున్నారు.. ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి తెలుసుకోండి అని ఆయన చెప్పారు. రాబోయే ఏడాది లోపు అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. రైతులను పదేళ్ల పాటు ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ నేతలు రైతు దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు 12 కిలోలు దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ నేతలది.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ పదేళ్ళలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు.