ధాన్యం కొనుగోలు అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీ సీట్లు గెలుస్తాం.. జూన్ 9వ తేదీన రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పుకొచ్చారు. ఇక, ప్రతిపక్ష పార్టీలు బురద జల్లే పిచ్చి పిచ్చి మాటలు మట్లాడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. కిషన్ రెడ్డి ఇవాళ దీక్ష చేశారు.. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నిజాయితీగా పని చేస్తోంది.. ధాన్యం కొనుగోలు విషయంలో మాట్లాడే వారికి అవగాహన లేదు అన్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మేము ధాన్యం కొనుగొలు చేసినంత నిజాయితీగా ఎవరు చేయలేదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Read Also: Sreemukhi : గ్రీన్ శారీలో అదరగొడుతున్న శ్రీముఖి..
కాగా, ఏప్రిల్ 1వ తేదీ కంటే ముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 6, 919 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.. లాస్ట్ ఇయర్ 335 కేంద్రాలు ఓపెన్ అయ్యాయి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిసిగ్గుగా మట్లాడుతున్నారు.. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం 2.7 లక్షల మెట్రిక్ టన్నులు.. లాస్ట్ ఇయర్ 230 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు అని ఆయన చెప్పారు. Msp కంటే ఎక్కువ ధరకు ధాన్యం కొంటున్నాం.. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని ఈ సారి ముందే కొనుగోలు కేంద్రాలు తెరిచాం.. కొనుగోలు కేంద్రం నుంచి రైస్ మిల్లుకు ధాన్యం కొనుగోలుకి రవాణా వ్యవస్థ సిద్ధం చేశామన్నారు.