Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నెల 20న ఐదో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
Amit Shah: కాంగ్రెస్ కొన్ని దశాబ్ధాలుగా దేశాన్ని దోచుకుంటోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. శుక్రవారం రోజు ఆయన అమేథీ, రాయ్‌బరేలీలో స్మృతి ఇరానీ, దినేష్ ప్రతాప్ సింగ్‌లకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో శుక్రవారం పాల్గొన్న ఆయన రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Lok Sabha Elections : సోనియా గాంధీ రాయ్‌బరేలీలో ఉన్నారు. నేడు రాయ్‌బరేలీ ఐటీఐ దగ్గర జరిగే ర్యాలీలో ఆమె ప్రసంగిస్తారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్‌లు ఆయనతో పాటు వేదికపై ఉన్నారు.
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంగళవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బుధవారం (రేపు) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఒరిస్సా రాష్ట్రంలోని బోలంగిర్ లోక్ సభ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీతో కలిసి ప్రత్యేక విమానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బొలంగిర్ లోక్ సభ స్థానానికి చేరుకోనున్నారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో బహిరంగ చర్చకు బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షుడు అభినవ్ ప్రకాశ్ పేరును సోమవారం నామినేట్ చేసింది. భారతీయ జనతా యువమోర్చా ప్రెసిడెంట్ తేజస్వి సూర్య రాహుల్ గాంధీకి రాసిన లేఖలో, 'ఇది రాజకీయ కుటుంబానికి చెందిన వారసులు, సాధారణ యువకులకు మధ్య గొప్ప చర్చ అవుతుంది' అని రాశారు.
రాహుల్ గాంధీ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారు. కాగా.. రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా.. పెళ్లి గురించి ప్రశ్న అడిగారు. ఈ సందర్భంగా ఆయన స్పష్టత ఇచ్చారు.
Sonia Gandhi : దేశంలోని 96 లోక్‌సభ స్థానాలకు నాల్గవ దశలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే రాజకీయ పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. నాల్గవ దశ ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన వీడియో సందేశం ఇచ్చారు.
Rahul Gandhi : లోక్‌సభ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరుకుంది. యుపిలోని హాట్ సీట్లలో ఉన్న అమేథీ, రాయ్‌బరేలీలో పోటీ ఉత్కంఠగా మారింది. ఈసారి వాయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ ఈరోజు తొలిసారిగా ప్రచారం నిర్వహించనున్నారు.
PM Modi: పశ్చిమ బెంగాల్లో ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలపై విరుచుకుపడ్డారు. సందేశ్‌ఖాలీలో టీఎంసీ నాయకులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఇప్పుడు ఆ పార్టీ గుండాలు వారిని బెదిరిస్తున్నారని మోడీ ఆరోపించారు.