మోడీ, అమిత్ షాపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. స్టాక్ మార్కెట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. స్టాక్ మార్కెట్ల స్కామ్‌పై జేపీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జూన్3న స్టాక్ మార్కెట్లు పెరుగుతాయని హోంమంత్రి చెప్పారని.. ఈ విషయం ఆయనకు ఎలా తెలుసని ప్రశ్నించారు. ఇది స్టాక్ మార్కెట్లో అత్యంత పెద్ద స్కామ్ అని చెప్పుకొచ్చారు. స్టాక్ మార్కెట్ల విషయంపై మొదటిసారిగా ప్రధాని మోడీ మాట్లాడారన్నారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తమ విధులను దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. జూన్ 3 పెరిగిన స్టాక్ మార్కెట్లు.. జూన్ 4న పడిపోయాయన్నారు. ఎన్నికల అనంతరం మీడియా తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే విషయంలో మోడీ ప్రమేయం ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఫారెన్ ఇన్వెస్టర్లకు .. ఎగ్జిట్ పోల్స్‌కు ఏమైనా సంబంధం ఉందా.. ఎగ్జిట్ పోల్స్ చేసిన వారికి బీజేపీతో సంబంధం ఉందా.. స్కాక్ మార్కెట్ల పడిపోవడంతో ఇన్వెస్టర్లు 30 లక్షల కోట్లు నష్టపోయారన్నారు. బీజేపీ ఇంటర్నల్ సర్వేలో 220 సీట్లు వస్తాయని ముందే వారికి తెలుసన్నారు. ఎన్నికల తరువాత షేర్లు పెరుగుతాయని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా పదే పదే ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ అగ్రనేతలు స్టాక్ మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటరీ విచారణ చేయాలని కోరారు.
ఎన్నికల ఫలితాల ప్రకటనకు కొద్ది రోజుల ముందు స్టాక్ మార్కెట్ గురించి బీజేపీ నేతలు ఎందుకు వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్‌పై వ్యాఖ్యానించడాన్ని తొలిసారిగా గుర్తించినట్లు రాహుల్ గాంధీ అన్నారు.