పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కర్ణాటక ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ కేశవ్ ప్రసాద్ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ శుక్రవారం బెంగళూరు కోర్టుకు హాజరయ్యారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో కాంగ్రెస్ నేత, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా నిందితులుగా ఉన్నారు. అయితే వారిద్దరికీ కొన్ని రోజుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
READ MORE: DELHI: ఎన్డీఏ ఎంపీల సమావేశం ప్రారంభం.. వేదికపై పవన్ కల్యాణ్, చంద్రబాబు
గత బీజేపీ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో 40 శాతం కమీషన్ తీసుకున్నదని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2019 నుంచి 2023 వరకు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం తన పాలనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. దీనికి సంబంధించి ప్రకటనలు ప్రచురిస్తూ తప్పుడు ప్రచారం చేశారని బీజేపీ నేత పరువు నష్టం దావా వేశారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సిద్ధరామయ్య, శివకుమార్ తప్పుడు ఆరోపణలు చేశారని, అందుకే వారిపై ఐపీసీ సెక్షన్ 500 ప్రకారం చర్యలు తీసుకోవాలని కేశవప్రసాద్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసులో జూన్ 7న కచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని రాహుల్ గాంధీని న్యాయమూర్తి కెఎన్ శివకుమార్ ఆదేశించారు.
జూన్ 1న బెంగళూరు కోర్టు ఈ కేసులో భాగస్వాములైన సీఎం సిద్ధరామయ్య, శివకుమార్, రాహుల్ గాంధీని హాజరు కావాలని ఆదేశించింది. హాజరైన సిద్ధరామయ్య, శివకుమార్ కి బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీ గైర్హాజరవ్వడంతో ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని బీజేపీ నేత తరఫు న్యాయవాది డిమాండ్ చేశారు. జూన్ 7న తప్పక హాజరు కావాలని కోర్టు కోర్టు రాహుల్ కి ఆదేశించింది. కోర్టు విచారణ అనంతరం ఇక్కడి భారత్ జోడో భవన్‌లో రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఓడిపోయిన అభ్యర్థులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.