Congress: బీజేపీకి కంచుకోటగా భావించిన ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. గత రెండు పర్యాయాలు బీజేపీ సొంతగా మెజారిటీ మార్క్(272) సీట్లను సాధించేందుకు కారణమైన యూపీ ఓటర్లు ఇప్పుడు మాత్రం అతి తక్కువ సీట్లలో కాషాయ పార్టీని గెలిపించారు. మొత్తం 80 స్థానాల్లో బీజేపీకి 33 సీట్లు రాగా, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) 37 సీట్లను దాని మిత్రపక్షం కాంగ్రెస్ 06 సీట్లను గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసి 06 సీట్లను మాత్రమే గెలుచుకుంటే, బీజేపీ ఏకంగా 62 సీట్లతో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే, ఈ సారి మాత్రం రామమందిరం,డెవలప్మెంట్ మంత్రం పనిచేయలేదు. దీంతో బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కు చేరకుండా దెబ్బపడింది.
Read Also: Kangana Ranaut: రేప్, మర్డర్ చేసే ఓకేనా.? కుల్విందర్ కౌర్‌ని మద్దతునివ్వడంపై ఫైర్..
ఇదిలా ఉంటే ఇండియా కూటమికి భారీ విజయాన్ని కట్టబెట్టిన ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ జూన్ 11 నుంచి 15 వరకు ‘ధన్యవాద యాత్ర’ నిర్వహించనుంది. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించింది.ఈ యాత్రంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. యాత్రలో వివిధ వర్గాల ప్రజలకు రాజ్యాంగ ప్రతిని ఇచ్చి సత్కరించనున్నారు.
రాహుల్ గాంధీ గతంలో ఆమె తల్లి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీలో బిజెపి ప్రత్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై మూడు లక్షల ఓట్లతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మరో కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీ నుంచి రాహుల్ గాంధీని ఓడించిన దింపిన బీజేపీ స్మృతి ఇరానీ, ఈసారి కాంగ్రెస్ విధేయుడు కిషోరీ లాల్ శర్మ చేతిలో 1.65 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు.