సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎవరి పొజేషన్ ఏంటో తెలిసిపోయింది. తాజా ఫలితాల్లో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారం ఛేజిక్కించుకుంది. ఇక ఇండియా కూటమి కూడా ఊహించని విధంగా సీట్లు సంపాదించింది. ఇక కాంగ్రెస్ సొంతం 99 సీట్లు సంపాదించి.. ప్రతిపక్ష హోదా నిలబెట్టుకుంది. అయితే ఇప్పుడు ప్రతిపక్ష నేత ఎవరనేది చర్చ జరుగుతోంది. కొత్త ఈ పోస్టుకు రాహుల్ గాంధీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు నుంచి భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా చుట్టేశారు. ఇండియా కూటమికి ఇంతటి రిజల్ట్ రావడానికి రాహుల్‌నే కారణమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌నే ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలని డిమాండ్ జరుగుతోంది.
తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 234 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ తర్వాత సింగిల్‌గా కాంగ్రెస్ పార్టీనే అధిక సీట్లు సంపాధించుకుంది. ఇండియా కూటమిలో సైతం కాంగ్రెస్ పార్టీనే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఎవరు ఉండాలనే విషయంపై పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. గతంలో కంటే కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు గెలుచుకొని పుంజుకోవటంలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే రాహుల్ గాంధీనే లోక్ సభలో కాంగ్రెస్ లీడర్ ఆఫ్ అపోజిషన్‌గా ఉండాలని తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు. ఈ మేరకు తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన మాణిక్యం ఠాగూర్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వివేక్ తన్ఖా సైతం కూడా లోక్‌సభలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షనేతగా ఎన్నకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం కూడా స్పందించారు. తన వ్యక్తిగతంగా.. లోక్ సభలో కాంగ్రెస్ ప్రతిపక్షపార్టీ నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకుంటే మంచిదని వెల్లడించారు. కాంగ్రెస్ గతం కంటే మెరుగైన స్థానాలు గెలవటంతో లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండాలనే చర్చ పార్టీ నేతల్లో జోరుగా సాగుతోంది. హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.