వయనాడ్ ప్రజల కోసం తన ఆఫీస్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. ఎంపీగా గెలిచిన సందర్భంగా వయనాడ్‌లో ప్రియాంక కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఫలితాలు కూడా వచ్చేశాయ్. మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఏర్పడలేదు.
అలా చేస్తేనే.. మేం కాల్పుల విరమణకు ఒప్పుకుంటాం.. దాదాపు మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియటం లేదు. అటు కీవ్ సైనికులు కూడా రష్యా దూకుడును ఎదుర్కోలేక దేశం వదిలి పారిపోతున్నారు. ఈ పరిణామాల వేళ కాగా, బ్రిటన్ మీడియా సంస్థ ‘స్కై న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ.. కీవ్ అధీనంలో ఉన్న భూభాగాన్ని నాటో పరిధిలోకి తీసుకుంటే యుద్ధాన్ని ముగించే అవకాశం ఉందన్నారు. నేటితో ముగియనున్న…
ఇండియా కూటమిలో బీటలు వారుతున్నాయి. కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ సంబంధాలు తెగతెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే దీనికి పునాది పడింది. తాజాగా కాంగ్రెస్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది
Rahul Gandhi: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. జో బైడెన్, ప్రధాని నరేంద్రమోడీని రాహుల్ గాంధీ ఎగతాళి చేయడాన్ని దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. అమెరికాతో భారత్‌కి ఉన్న బంధాలకు అనుగుణంగా ఆయన వ్యాఖ్యలు లేవని చెప్పింది. శుక్రవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు. జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణం చేశారు. గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్.. హేమంత్‌తో ప్రమాణం చేయించారు.
వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన ప్రియాంక గాంధీ తొలిసారిగా పార్లమెంట్ హౌజ్‌లో అడుగుపెట్టారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక పార్లమెంట్ హౌస్‌కి చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె పేరు పిలవగా.. నూతన ఎంపీ చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని.. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో వచ్చారు.
Hemant Soren: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఈరోజు ( గురువారం) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాంచీలోని మొరాబాది స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ వయనాడ్ లోక్‌సభ బైపోల్లో ఘన విజయం సాధించారు. దాదాపు 4 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. సోదరుడు రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి.