Hemant Soren: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఈరోజు ( గురువారం) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాంచీలోని మొరాబాది స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ వయనాడ్ లోక్సభ బైపోల్లో ఘన విజయం సాధించారు. దాదాపు 4 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. సోదరుడు రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
Hemant Soren: న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని హేమంత్ సోరెన్ అతని సతీమణి, గండే నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కల్పనా సోరెన్ కలిశారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.
సినీ నటుడు శ్రీ తేజపై భార్య సంచలన ఆరోపణలు సినీ నటుడు శ్రీ తేజ్ పెళ్లి పేరుతో అమ్మాయి లను ట్రాప్ చేస్తున్నాడని ఓ యువతీ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ పెళ్లి పేరుతో లొంగదీసుకొని 20 లక్షలు డబ్బులు కాజేశాడని సదురు యువతి ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లయిన మరో మహిళను ట్రాప్ చేసాడు. భార్య తో అక్రమ సంబంధం పెట్టుకోవడం తో ప్రైవేట్ బ్యాంక్ సీనియర్…
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం ఈరోజు అలహాబాద్ హైకోర్టుకు తెలియజేసింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 19న జరగనుంది. రాహుల్ గాంధీపై సీబీఐ విచారణ జరపాలని న్యాయవాది, బీజేపీ నేత విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారించింది.
జాతీయ రహదారుల భూసేకరణపై ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి సీరియస్ జాతీయ రహదారుల భూసేకరణపై ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతులకు అడ్వాన్సులు వెయ్యకుండా భూసేకరణ ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. సంవత్సరాలు గడుస్తున్న మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదని అడిగారు. వచ్చేవారం మన్నెగూడ పనులు ప్రారంభించండి.. మనం ప్రజల కోసం, రైతుల కోసం పని చేస్తున్నాం – కాంట్రాక్ట్ సంస్థల కోసం కాదు అని ఆయన…
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ వివాదానికి కేంద్రంగా మారారు. పార్లమెంట్లో ఈ రోజు జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని అగౌరపరిచారని బీజేపీ మండిపడుతోంది. మంగళవారం జాతీయ గీతాలాపన సమయంలో కూడా కాంగ్రెస్ నేత సరిగా ప్రవర్తించలేదని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
CM Revanth Reddy : దేశవ్యాప్తంగా కుల గణన అనేది కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాధించే సామాజిక న్యాయం మూడో ఉద్యమమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధమ ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయీకరణ వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం మొదటి దశ సాధిస్తే… రాజీవ్ గాంధీ హయాంలో 18 ఏళ్లకే ఓటు హక్కు.. మండల్ కమిషన్ నివేదిక వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం @ 2.0…