Rahul Gandhi: రాజ్యసభలో అమిత్ షా ‘అంబేద్కర్’ వ్యాఖ్యలు, ఈ రోజు పార్లమెంట్ వద్ద జరిగిన దాడికి సంబంధించిన ఘటనలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. హోం మంత్రి అందరి ముందే అంబేద్కర్‌ని అవమానించారు. మేము అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశామని రాహుల్ గాంధీ చెప్పారు. అదానీ వ్యవహారాన్ని పక్కన పెట్టాలనేదే బీజేపీ ఉద్దేశ్యమని రాహుల్ ఆరోపించారు.
Read Also: KTR: ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు నమోదు..
ఈ రోజు జరిగిన ఉద్రిక్త పరిస్థితుల గురించి రాహుల్ గాంధీ చెప్పారు. బీజేపీది అంబేద్కర్ వ్యతిరే విధానమని అన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఎంపీలంతా శాంతిగా ర్యాలీ చేస్తున్నామని, అదే సమయంలో బీజేపీ ఎంపీలు కర్రలతో వచ్చారని ఆరోపించారు. బీజేపీ ఎంపీలు మాపై కర్రలతో దాడి చేశారని అన్నారు. తమని పార్లమెంట్‌లోకి వెళ్లకుండా చేశారని ఆరోపించారు. అమిత్ షా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని, వారు మొదటి నుంచి అంబేద్కర్ వ్యతిరేకులని రాహుల్ గాంధీ చెప్పారు.
అంబేద్కర్ జ్ఞాపకాలను చెరిపేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. అమెరికాలో నరేంద్రమోడీ స్నేహితుడు అదానీపై కేసు ఉందని, మోడీ భారత్‌ని అదానీకి అమ్మేస్తున్నారని, ఇది ప్రధాన అంశమని, ఈ వ్యక్తులు దీనిపై చర్చించడం లేదని అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు అమెరికాలో అదానీ కేసు ప్రస్తావనకు వచ్చింది, దీనిపై చర్చను ఆపేందుకు బీజేపీ ప్రయత్నించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదే బీజేపీ ప్రాథమిక ఉద్దేశ్యమని చెప్పారు.