PM Modi: నేడు (సోమవారం) శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ దగ్గర భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. పార్లమెంట్లో ఫలవంతమైన చర్చలు జరగాలని అధికార, విపక్ష సభ్యులను కోరారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి భారీ మెజారిటీ సాధించింది. రాష్ట్రంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు జార్ఖండ్లో జేఎంఎం కూటమి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉంది. జేఎంఎం ప్లస్ 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎన్డీయే 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజాగా ఈ ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.
వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 4 లక్షలకు పైగా మెజార్టీతో ఆమె గెలుపొందారు. తాజాగా ప్రియాంక విక్టరీపై భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు.
BJP: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు పంపిణీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత వినోద్ తావ్డే, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సుప్రియా శ్రీనాట్, రాహుల్ గాంధీలకు లీగల్ నోటీసులు పంపారు. క్షమాపణలు చెప్పాలని, లేకుంటే రూ. 100 కోట్ల పరువు నష్టం నోటీసులు ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు.
మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధనికుడు.. పేదలు మధ్య వ్యత్యాసం పెరిగిపోతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ వల్లనే అదానీ దురాగతాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఏపీలో పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు ఏపీలో పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా రెండు నెలలు పింఛన్లు తీసుకోకున్నా మూడో నెలలో పింఛన్ పంపిణీ చేసేలా.. మొదటి రెండునెలలు పింఛన్ తీసుకోకున్నా మూడో నెలలో మొత్తం కలిపి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. వరుసగా మూడు నెలలు తీసుకోకుంటే శాశ్వతంగా వలస వెళ్లినట్టు భావిస్తూ పింఛన్ నిలిపివేయనున్నారు. ఈ నెల నుంచే ఈ గైడ్లైన్స్ అమలులోకి వచ్చాయి.…
Gautam Adani: అదానీ గ్రూపుపై అమెరికా లంచం ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. గౌతమ్ అదానీపై అమెరికా ప్రాసిక్యూటర్లు లంచం, మోసానికి పాల్పడ్డారని అభియోగాలు మోపింది.
Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేంద్రంలోని బీజేపీ పెద్దలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలు , దేశ సంపదను అదానీకి అప్పగిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కేవలం నిబంధనల మేరకు ఒప్పందాలు చేసుకుంటుందని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. Zomato: జీతం…
BJP: సోలార్ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. అయితే, అదానీ గ్రూప్ నుంచి లంచాలు అందుకున్న రాష్ట్రాలు ప్రతిపక్షాల పాలనలో ఉన్నాయని బీజేపీ పేర్కొంది.