MLC Kavitha : భారత రాజ్యాంగంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయము అని అన్నారు.. ఇది రాష్ట్రాల హక్కులను హరించడం కాదా అని ఆమె అన్నారు. ఫెడరల్ స్ఫూర్తిలో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని… కింద స్థాయిలో పథకాలు అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు కాదా అని ఆమె ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి మీకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వము అనే మాట మాట్లాడుతున్నారు అంటే రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తి ఏమైనట్లు అని, బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు.
Reliance: బడ్జెట్‌కు ముందే రిలయన్స్‌కు భారీ షాక్.. 5 రోజుల్లో రూ.75 వేల కోట్ల నష్టం
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల హక్కులను హరించే అధికారం వాటికి లేదని, పాకెట్ డైరీలా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడన్నారు. దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని కాపాడాలి అని అంటున్నారని, నేను ఆయనను తెలంగాణకు స్వాగతిస్తున్న.. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు.. మీరు చెబుతున్న రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడండన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా.. మీరు చెబుతున్న రాజ్యాంగ విలువలు ముందు ఇక్కడ కాపాడండని, కొన్ని నెలల క్రితం ఆసిఫాబాద్లో మతకల్లోహాలు జరిగి వందలాది మంది నిరాశ్రయులయ్యారు.. వాళ్ల గురించి ఒక్క నాయకుడు కూడా మాట్లాడటం లేదన్నారు. తెలంగాణ లో రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కుతున్నారని, రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కే ప్రభుత్వాలు ఉన్న ఈ సందర్భంలో విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని చేయడాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని ఆమె వ్యాఖ్యానించారు.
Bhatti Vikramarka : ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం