Rahul Gandhi: “కులగణన”తో మోసం.. నితీష్ కుమార్‌పై రాహుల్ గాంధీ ఆరోపణ
- ‘‘కుల గణన’’తో బీహార్ ప్రజల్నిమోసం చేశారు..
- సీఎం నితీష్ కుమార్‌పై రాహుల్ గాంధీ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రజల్ని మోసం చేయడానికే అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో అభివృద్ధి పనులు చేయడానికి కులగణన అనేది చాలా అవసరమని అన్నారు. శనివారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తమ పార్టీ కులగణనకు కట్టుబడి ఉందని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో రాజ్యాంగాన్ని అణగదొక్కాలని చూస్తు్న్నాయని, అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు.
Read Also: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు.. ఛత్తీస్‌గఢ్‌లో నిందితుడి అరెస్ట్..
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘‘నిజమైన స్వాతంత్ర్యం’’ వ్యాఖ్యలు దేశ రాజ్యాంగానికి విరుద్ధం అని అన్నారు. పాట్నాలోని బాపు సభగర్‌లో జరిగిన ‘‘సంవిధాన్ సురక్ష సమ్మేళన్’’లో ఆయన మాట్లాడారు. ‘‘ఈ దేశంలో దళితులు, మైనారిటీలు, సామాజికంగా అణగారిన ప్రజలు 90 శాతం ఉన్నారు, కానీ వారు వ్యవస్థలో భాగం కాదు. అందుకే మేము కుల గణనను డిమాండ్ చేస్తున్నాము’’ అని అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన అనేది ఓబీసీలు, దళితుల భాగస్వామ్యం పరిపాలనలో, ఇతర రంగాల్లో ఎంత మేర ఉందో అని తెలుసుకునేందుకు సాయపడుతుందని చెప్పారు.
కులగణన లక్ష్యం వివిధ కులాల గణన గురించి మాత్రమే కాదని, దేశ సంపదలో వారి భాగస్వామ్యం గురించి తెలుసుకోవడమని అన్నారు. బీహార్ ప్రభుత్వం చేసిన కుల సర్వే ప్రజల్ని మోసం చేయడానికే అని కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన వారికి రిజర్వేషన్ 50 శాతం పరిమితి సరిపోదు అని అన్నారు. మెజారిటీ ప్రజల ప్రయోజనం కోసం కాంగ్రెస్ రిజర్వేషన్లను పెంచుతుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు దేశంలోని అన్ని వ్యవస్థల్లోకి చేరాయని, రాజ్యాంగాన్ని కాపాడుకునే వారికి ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారికి మధ్య పోరాటం జరుగుతోందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!