ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి అఖండ విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. "ఈ విజయం తెలంగాణ సమాజానికి, ఉపాధ్యాయులకు అంకితం ఇస్తున్నాం. రెండు ఎమ్మెల్సీలు ఏక కాలంలో రావడం చాలా సంతోషం. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీని ఆదరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన…
Jagga Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈరోజు ఢిల్లీకి పయనం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎమ్మెల్సీ అడుగుతలేను.. నేను అడగొద్దు కూడా అన్నారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి లక్నోలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు(ACJM) రూ.200 జరిమానా విధించింది. ఏప్రిల్ 14న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసు రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఇచ్చిన ప్రకటనకు సంబంధించినది. డిసెంబర్ 17, 2022న అకోలాలో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ పై వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై లక్నోలోని ACJMలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. రాహుల్ గాంధీ ప్రకటన…
Meenakshi Natarajan: ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ సమస్యల పైన ప్రభుత్వాలను, పాలకులను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ఇందుకోసం ప్రత్యేక అనుమతులు అవసరం లేదని తెలిపింది.
కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ (23) హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. మార్చి 1న రోహ్తక్-ఢిల్లీ హైవేలోని సంప్లా బస్టాండ్ సమీపంలో సూట్‌కేస్‌లో నర్వాల్ మృతదేహం లభ్యమైంది.
కుంభమేళా, అయోధ్య కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధాని మోడీ గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా కాంగ్రెస్‌పై బీజేపీ మాటల దాడి చేసింది.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై రాహుల్ గాంధీ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌లో స్పందిస్తూ.. 'తెలంగాణలో సొరంగం పైకప్పు కూలడం నన్ను ఎంతో బాధించింది.. రెస్క్యూ కార్యకలాపాలు జరుగుతున్నాయని నాకు సమాచారం అందింది.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదంలో ఉన్నవారిని త్వరగా తిరిగి తీసుకురావడానికి సాధ్యమైనంతవరకు ప్రయత్నం చేస్తుంది' అని రాహుల్ గాంధీ తెలిపారు.
India On USAID: భారతదేశ ఎన్నికల్ని ప్రభావితం చేయాలనే ఉద్ధేశ్యంతో, 21 మిలియన్ డాలర్లను గత అమెరికా ప్రభుత్వం కేటాయించిందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. ‘‘కాంగ్రెస్ ఎకో సిస్టమ్’’, రాహుల్ గాంధీలు ఈ నిధుల్ని వాడుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
Kishan Reddy : ప్రపంచమంతా ఎరువుల ధరలు పెరిగితే ఒక్క భారతదేశంలోనే రేటు పెరగలేదని, కాంగ్రెస్ హయాంలో యూరియా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మెదక్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ హయాంలో తెలంగాణకి పసుపు బోర్డు వచ్చిందని, తెలంగాణలో ప్రధాని ఇచ్చిన పథకాలు అమలు కావాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం తెలంగాణని దోపిడీ చేస్తే…ఇప్పుడు సోనియాగాంధీ కుటుంబం…
Assam Congress: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రం అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా లోక్‌సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్‌ను నియమించాలని కోరుతూ ఆ పార్టీ సీనియర్ నాయకుల బృందం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాసింది. ఇదే విషయాన్ని ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు కూడా తెలియజేశారు.