విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. బీసీ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లులను పార్లమెంట్ ఆమోదించి.. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీ సంఘాలు పోరుకు సిద్ధమయ్యాయి. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల పోరు గర్జన కార్యక్రమాన్ని బుధవారం చేపడుతున్నాయి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న ఈ ధర్నాలో పాల్గొనేందుకు 12 బీసీ సంఘాలకు చెందిన సుమారు1500 మంది ప్రతినిధులు…
Devendra Fadnavis: కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఏప్రిల్ 02న లోక్‌సభలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టనుంది. సభలో బిల్ పాస్ కావాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, అడ్డుకునేందుకు కాంగ్రెస్, ఇండీ కూటమి సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఇరు పార్టీలు తమ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. రాబోయే మూడు రోజులు సభకు ఖచ్చితం రావాలని ఆదేశించాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం రాజకీయ మలుపు తీసుకుంటోంది. ఈ అంశంపై విద్యార్థుల ఆందోళనలతో పాటు రాజకీయ నాయకుల ప్రస్తావనలు పెరుగుతున్నాయి. తాజాగా, తెలంగాణ భవన్లో HCU విద్యార్థులతో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థులు తమ ఆందోళనలను వ్యక్తం చేయగా, కేటీఆర్ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “HCU భూములు అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత ఆరాటపడుతుంది?”…
BC Reservations : తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ శాసన సభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నాకు పిలుపునిచ్చాయి. ఈ మహాధర్నాలో ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఇతర మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు ఆది…
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వ ‘‘క్రోనిజం’’, ‘‘నియంత్రణ దుర్వినియోగం’’ భారతదేశ బ్యాంకింగ్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయని అన్నారు. దీంతో ఒత్తిడి, కఠినమైన పని పరిస్థితులను జూనియర్ ఉద్యోగులు భరించాల్సి వస్తోందని అన్నారు. బిజెపి ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం మానవ నష్టాన్ని కలిగిస్తుంది, దేశవ్యాప్తంగా వేలాది మంది నిజాయితీగల పని నిపుణులను ప్రభావితం చేస్తుందని ఆరోపించారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ ఆరోపణలను అమిత్ షా కొట్టిపారేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. థానే నుంచి వచ్చిన ఓ నాయకుడు.. బీజేపీతో చేతులు కలిపి శివసేనను చీల్చేశాడంటూ.. అతడు దేశద్రోహి అంటూ షిండేను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Congress: వరస ఓటములతో కుదేలవుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థాగత పునరుద్ధరణకు పార్టీలో రంగం సిద్ధమవుతుంది.
PM Modi: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరిగిన ‘‘మహాకుంభమేళా’’ని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్లో కొనియాడారు. లోక్‌సభలో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. కుంభమేళా విజయవంతం కావడానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘భారతదేశ కొత్త తరం మహా కుంభమేళాతో కనెక్ట్ అయిందని, న్యూ జనరేషన్ సంప్రదాయాలు, విశ్వాసాన్ని గర్వంగా స్వీకరిస్తోందని, కుంభమేళ ప్రపంచం మొత్తానికి భారతదేశ గొప్పతనాన్ని తెలియజేసిందని, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత,