గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాలు బుధవారంతో ముగియనున్నాయి. మంగళవారం పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. నేటి సమావేశం ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. నిన్న జరిగిన విస్తృతస్థాయి సీడబ్ల్యూసీ సమావేశంలో పలు అంశాలపై సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. దీనికి అనుగుణంగా నేడు తీర్మానాలు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Megastar : మార్క్ శంకర్‌ను చూసేందుకు సింగపూర్ కు మెగాస్టార్
ఈ ఏడాది చివరి నుంచి వరుసగా ఆయా రాష్ట్రాల్లో వరుసగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి ఎలా చొచ్చుకెళ్లాలన్న అంశంపై చర్చించనున్నారు. ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2026లో అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2027లో పంజాబ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. 2028లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 2029లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: Nagavamsi : వైష్ణవిని తర్వాత సినిమాలో ‘రా’గా చూపిస్తాం : నాగవంశీ