Bandi Sanjay : డూప్లికేట్ గాంధీ కుటుంబానికి చట్టాలు వర్తించవా..?
- డూప్లికేట్ గాంధీ కుటుంబం అంటూ బండి సంజయ్ ఫైర్
- వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగంపై సంజయ్ విమర్శలు
- AIMIM-కాంగ్రెస్ బంధంపై బీజేపీ ఘాటైన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి డూప్లికేట్ గాంధీ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లను లక్ష్యంగా చేసుకొని ఆయన విమర్శల వర్షం కురిపించారు. “భారతదేశ రాజ్యాంగానికి అతీతులా? చట్టాలు వీరికి ఎందుకు వర్తించకూడదు?” అని సంబరపడ్డారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను దోచుకునేందుకు యంగ్ ఇండియా సంస్థ పేరుతో 50 వేల కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న కుట్రలో ఈ కుటుంబం మునిగిపోయిందని ఆరోపించారు. ఇదంతా యూపీఏ హయాంలోనే బయటపడిందని, నిందితులు అరెస్ట్ కాకుండా బెయిల్ తెచ్చుకున్నారని చెప్పారు. “ఇందులో మోదీ, బీజేపీ పాత్ర ఎక్కడ ఉంది?” అని ఆయన ప్రశ్నించారు.
నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్లో మీకు వాటా ఉందని నమ్మితే, ధర్నా చేయాల్సింది టెన్ జనపథ్ (సోనియా ఇంటి ముందు) అని కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తప్పు చేస్తే ఎవరు అయినా జైలుకెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణలో వక్ఫ్ ఆస్తులపై జరుగుతున్న రాజకీయాల పట్ల బండి సంజయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒవైసీ కుటుంబం వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకొని లబ్ధి పొందుతుండగా, పేద ముస్లింలకు ఏ ప్రయోజనం లేదని విమర్శించారు. ఆలయాలు, గురుద్వారా, క్రైస్తవ మత్సకారుల భూములపై కూడా వక్ఫ్ పేరు చెప్పి దొంగపడి పెట్టారని ఆరోపించారు.
Also Read
రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా మజ్లిస్ చేస్తున్న ఆందోళనకు రేవంత్ ఆర్థికంగా సహకరిస్తున్నారంటూ సంచలన ఆరోపణ చేశారు. ఈ పరిణామాలను అడ్డుకోకపోతే తలెత్తే సమస్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒవైసీ నిర్వహించబోయే సభ కాంగ్రెస్ స్పాన్సర్డ్ ప్రోగ్రామేనని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఎంఐఎంకు దూరంగా ఉండాలని చెబుతుండగా, వాస్తవంలో కాంగ్రెస్-ఎంఐఎం మధ్య గాఢమైన సహకారం ఉందని అన్నారు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటేసి కాంగ్రెస్ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ అంతరాత్మను నమ్ముకొని ఓటేయాలని సూచించారు. ఓటింగ్‌కు దూరంగా ఉంటే, హైదరాబాద్ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.
Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా?.. ఫైబర్ అధికంగా ఉండే ఈ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకోండి
తాజావార్తలు
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
ట్రెండింగ్
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!