గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాలు బుధవారంతో ముగియనున్నాయి. మంగళవారం పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. నేటి సమావేశం ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి.
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. ‘‘భారత రాజ్యాంగం 1000 ఏళ్ల పాతది’’ అని రాహుల్ గాంధీ ఇటీవల ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగం బీఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, సంత్ కబీర్ ఆలోచనల్ని కలిగి ఉందని అన్నారు. పాట్నాలో జరిగిన ‘‘సంవిధాన్ సురక్ష సమ్మేళన్’’ కార్యక్రమంలో రామహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అహ్మదాబాద్ వేదికగా నేటి నుంచి రెండు రోజుల పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక సమావేశాలు జరగనున్నాయి. మంగళ, బుధవారాల్లో జరిగే సమావేశాల్లో పార్టీలో కీలకమైన నాయకత్వం, సంస్థాగత మార్పులకు సిద్ధమవుతోంది. కీలకమైన రాష్ట్రాల ఎన్నికల ముందు ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Congress: అహ్మదాబాద్ వేదికగా రేపు కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ జరగబోతోంది. పార్టీలో కీలకమైన నాయకత్వం, సంస్థాగత మార్పులకు సిద్ధమవుతోంది. కీలకమైన రాష్ట్రాల ఎన్నికల ముందు ఈ భేటీ జరుగుతుంది. ప్రస్తుతం అందరి దృష్టి కూడా ప్రియాంకా గాంధీపై నెలకొంది. ఆమెకు కీలక పాత్ర అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశంలో సంస్థాగత వికేంద్రీకరణ, కూటమి నిర్వహణ, ప్రజలకు మరింత చేరువయ్యే అంశాలపై చర్చించి, తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వస్తున్న వేళ…
బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. బీజేపీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. ఇక కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ కొద్దిరోజులుగా ‘‘పలయన్ రోకో, నౌక్రీ దో’’ (వలసలను ఆపండి, ఉద్యోగాలు కల్పించండి) పేరుతో పాదయాత్ర చేస్తున్నారు.
రేపటి నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక సమావేశాలు జరగనున్నాయి. మంగళ, బుధవారాల్లో జరిగే సమావేశాల్లో.. మూలాల నుంచి పార్టీని పునరుద్ధరణ చేసే లక్ష్యంగా నేతలంతా సమాలోచనలు చేయనున్నారు. 64 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్‌లో సమావేశాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 1938లో గుజరాత్‌లోని బర్దోలిలో, 1961లో భావనగర్‌లో ఏఐసీసీ సమావేశాలు జరిగాయి.
Rahul Gandhi: వక్ఫ్ సవరణ బిల్లు-2025ని పార్లమెంట్ ఆమోదించింది. అయితే, ఆమోదం పొందినప్పటికీ దీనిపై రచ్చ ఆగడం లేదు. కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి పార్టీల నేతలు వక్ఫ్ బిల్లును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. వక్ఫ్ తర్వాత ఆర్ఎస్ఎస్ కాథలిక్ చర్చిలను, క్రైస్తవ సమాజాన్ని టార్గెట్ చేయబోతోందని హెచ్చరించారు.
వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో రాహుల్ గాంధీ వెన్నుచూపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు. మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ చూయిస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మైనారిటీల హక్కులను కాలరాసి కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రియాంక గాంధీ అతి ముఖ్యమైన ఈ బిల్లు సమయంలో పార్లమెంటుకు హాజరు కాకపోవడం అత్యంత దారుణమని…
కాంగ్రెస్, బీఆర్ఎస్లు మజ్లిస్ పార్టీకి బానిసలుగా మారిపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మజ్లిస్ మెప్పు కోసమే ఇతర పార్టీలు వారి అడుగులకు మడుగులు వత్తుతున్నాయని తెలిపారు. అన్ని పార్టీలు పోటీ చేస్తాయని భావించామని, కానీ రాహుల్ గాంధీ, కేసీఆర్‌లు పోటీ చేయకుండా మజ్లిస్‌కు ఏకగ్రీవం చేయాలని యత్నించారని కిషన్ రెడ్డి…
Waqf Bill: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎట్టకేలకు ‘‘వక్ఫ్ సవరణ బిల్లు-2025’’ని నెగ్గించుకుంది. పార్లమెంట్‌లోని ఉభయసభల్లో మెజారిటీ సభ్యులు దీనికి ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ సహా సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, డీఎంకే, వామపక్షాలు,