Revanth Reddy : జూన్ 23 బీజేపీ పతనానికి పునాది రాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ కుటుంబంకి నోటీసులు ఇవ్వడం అంటే.. దేశం నీ అవమానించడమేనని, గాంధీ కుటుంబంకి జరిగిన అవమానం కాదు.. దేశ ప్రజలకు జరిగిన అవమానంగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఇందిరాగాంధీపై సీబీఐ కేసు పెట్టీ అవమానిస్తే… దేశం ఏకం అయ్యిందని, తిరిగి దేశానికి ఇందిరా గాంధీ ప్రధాని అయ్యిందని ఆయన గుర్తు చేశారు. జూన్ 23 బీజేపీ పతనానికి పునాది రాయి అని ఆయన మండిపడ్డారు. సోనియా గాంధీ ఈడీ ఆఫీస్ లో అడుగు పెట్టిన క్షణం నుండే మోడీ..అమిత్ షా పతనం మొదలైందన్నారు.
బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని, గాంధీ కుటుంబం మీద ఏం జరిగినా.. జనం చూస్తూ ఉండరన్నారు. సోనియా గాంధీ తెలంగాణకు తల్లి లాంటిదని, అలాంటి తల్లిని అవమనిస్తుంటే చూస్తూ ఊరుకుంటామా..? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ వారసులం కాబట్టి శాంతియుత నిరసన చేశాం.. సోనియా గాంధీని అవమానించాలని చూస్తే ఊరుకోమని ఆయన ధ్వజమెత్తారు. ఈ నెల 23న మళ్లీ ఈడీ ఆఫీస్ కి వస్తమని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా… రాష్ట్రంకి ముందు ఈడీ, సీబీఐ వస్తుంని, తర్వాత మోడీ..అమిత్ షా వస్తారన్నారు. గాంధీ కుటుంబం మీద కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తుందని, గాంధీ కుటుంబం ఈక కూడా పీకలేరని ఆయన మండిపడ్డారు.
Also Read
తాజావార్తలు
-
Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
-
BC Reservations: 34 శాతం బీసీ కోటాపై ఉత్కంఠ.. రిజర్వేషన్ల డేటా సమర్పించాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
ట్రెండింగ్
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!