ఆగస్టులో శ్రీలంక వేదికగా ఆసియా కప్ 2022 టోర్నీ జరగనుంది. అయితే ఇదే సమయంలో జింబాబ్వేలో మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా పర్యటించాల్సి ఉంది. ఒకే సమయంలో రెండు పర్యటనలు ఉండటంతో ఆసియా కప్‌కు రోహిత్ శర్మ సారథ్యంలోని సీనియర్ల జట్టును, జింబాబ్వేకు జూనియర్ల జట్టును పంపించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు ఆసియా కప్‌లో పాల్గొనే టీమ్‌కు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా.. జింబాబ్వే పర్యటనకు వెళ్లే బీ టీమ్‌కు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.…
దక్షిణాఫ్రితో టీ20 సిరీస్‌లో భారత జట్టుకు రిషభ్ పంత్ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే! అయితే, అతడు సమర్థవంతంగా జట్టుని నడిపించలేకపోయాడని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా.. మొదట్లో రెండు మ్యాచ్‌లు ఘోరంగా ఓడిపోవడంతో, అతడి కెప్టెన్సీని అందరూ తప్పుపట్టారు. ఎలాంటి నాయకత్వ లక్షణాలు అతనిలో లేవని, రిషభ్ స్థానంలో ఓ సీనియర్ ఆటగాడ్ని కెప్టెన్‌గా ఎంపిక చేయాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తొలి రెండు ఓటముల తర్వాత భారత్ రెండు మ్యాచ్‌లు కైవసం చేసుకున్నా.. అందులో రిషభ్…
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తొలుత రెండు మ్యాచులు ఓడిపోయిన సంగతి తెలిసిందే! దీంతో, ఈ సిరీస్ భారత్ చేజారినట్టేనని కామెంట్స్ వచ్చాయి. మొదటి మ్యాచ్‌లో 200కు పైగా పరుగులు చేసినా డిఫెండ్ చేయలేకపోవడం, రెండో మ్యాచ్‌లో 148 పరుగులకే చేయడంతో.. భారత ప్రదర్శనతో విమర్శలు వచ్చాయి. ఇలాంటి ప్రదర్శనతో సిరీస్ నెగ్గడం కష్టమేనంటూ చాలామంది పెదవి విరిచారు. అయితే, ఆ విమర్శలకు చెక్ పెడుతూ భారత్ మూడో మ్యాచ్‌ని కైవసం చేసుకుంది.…
దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం భారత తుది జట్టుని ప్రకటించడం వరకూ.. జమ్మూ కశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ టీమిండియాలో స్థానంపై కొంత వివాదమైతే నెలకొంది. అతడు అద్భుతంగా బౌలింగ్ వేస్తోన్నా, వేగంగా బంతులు విసురుతూ బ్యాట్స్మన్లను ముప్పుతిప్పలు పెడుతున్నా.. ఎందుకు భారత జట్టులో చోటివ్వడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. మాజీలు సహా, పాకిస్థాన్ వాళ్లూ పెదవి విరిచారు. అనుభవం పేరుతో కావాలనే అతడ్ని జట్టులో తీసుకోవడం లేదని మండిపడ్డారు. చివరికి ఆ విమర్శలకి చెక్ పెడుతూ.. అతనికి…
వివాదాలు, రాజకీయాలకు దూరంగా ఉండే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయారు.. అది కూడా ఆయన ఓ రాజకీయ పార్టీ సమావేశాలకు హాజరు అవుతారని వార్త.. దానికి ప్రధాన కారణం.. ఆయన భారతీయ జనతా పార్టీ సమావేశానికి హాజరుకానున్నారంటూ.. ఓ ఎమ్మెల్యే ప్రకటన చేయడంతో.. రాహుల్ ద్రవిడ్ సోషల్ మీడియాను షేక్ చేశారు. చివరకు స్వయంగా ఈ వ్యవహారంపై టీమిండియా హెడ్ కోచ్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. Read Also:…
టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ తనను రిటైర్ కావాలని సూచించాడంటూ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. అయితే సాహా వ్యాఖ్యలపై కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. సాహా తనపై చేసిన ఆరోపణలు తనను బాధించలేదని తెలిపాడు. టీమిండియా సాధించిన ఎన్నో విజయాలకు కారణమైన సాహాపై తనకు గౌరవం కూడా ఉందన్నాడు. జట్టు ఎంపికలో తాను, కెప్టెన్ రోహిత్ శర్మ కఠినంగా ఉంటామని.. ఆటగాళ్లను తుది జట్టులో ఎందుకు ఎంపిక చేయడం లేదో కారణాన్ని…
దక్షిణాఫ్రికా గడ్డపై కెప్టెన్ కోహ్లీ నుంచి తాను ఒక గొప్ప సిరీస్ ను కోరుకుంటున్నానని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నారు. కోహ్లీ ఒక అద్భుతమైన ఆటగాడే కాకుండా, గొప్ప కెప్టెన్ అని కితాబిచ్చారు. టెస్టుల్లో మన జట్టు పురోగతిని కొనసాగించాలని తాము భావిస్తున్నామని చెప్పారు. జట్టు పురోగతిలో కోహ్లీ పోషించిన పాత్ర గొప్పదన్నారు. టెస్టు క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే ఆటగాళ్లలో కోహ్లీ ఒక్కడని చెప్పారు. ఈ టెస్ట్ సిరీస్‌లో కూడా కోహ్లీ అద్భుతంగా రాణిస్తాడనే…
టీమిండియా కోచ్‌గా…రవిశాస్త్రి ఉన్నంత కాలం…రన్‌మిషిన్ కోహ్లీ కు ఎదురులేదు. రవిశాస్త్రి హయాంలో…టీమిండియాకు కోహ్లీ చెప్పిందే వేదం. ఎన్నో టెస్టు సిరీస్‌లు, వన్డేలు, టీ20లు ఆడినా…రవిశాస్త్రి నుంచి కోహ్లీ సలహాలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ. సెంచరీ చేసి రెండేళ్లయినా…ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడన్న దానిపై దృష్టి పెట్టలేదు రవిశాస్త్రి. విదేశాలతో పాటు స్వదేశంలో జరిగిన టెస్టుల్లోనూ మంచి స్కోర్లు సాధించలేకపోయాడు కోహ్లీ. ఎక్కడ లోపముందో…చెప్పే ప్రయత్నం చేయలేకపోయాడు రవిశాస్త్రి. ప్రస్తుతం టీమిండియా క్రికెట్లో పరిస్థితి మారిపోయింది. దక్షిణాఫ్రికాతో టెస్టు…
సౌత్ ఆఫ్రికాలో ఓమైక్రాన్ కేసులు పెరుగుతున్న సమయంలో టీం ఇండియా అక్కడికి వెళ్తుందా లేదా అనే ప్రశ్న వచ్చింది. కానీ జట్టు అక్కడికి సౌత్ ఆఫ్రికా అని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. కానీ అంతకంటే ముందే భారత ఏ జట్టు అక్కడికి వెళ్లి సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో మ్యాచ్ లు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ జట్టుకు ప్రియాంక్ పంచాల్ న్యాయకత్వం వహిస్తున్నాడు. అయితే ఇక అక్కడికి మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం…