ఆగస్టులో శ్రీలంక వేదికగా ఆసియా కప్ 2022 టోర్నీ జరగనుంది. అయితే ఇదే సమయంలో జింబాబ్వేలో మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా పర్యటించాల్సి ఉంది. ఒకే సమయంలో రెండు పర్యటనలు ఉండటంతో ఆసియా కప్‌కు రోహిత్ శర్మ సారథ్యంలోని సీనియర్ల జట్టును, జింబాబ్వేకు జూనియర్ల జట్టును పంపించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు ఆసియా కప్‌లో పాల్గొనే టీమ్‌కు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా.. జింబాబ్వే పర్యటనకు వెళ్లే బీ టీమ్‌కు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. గతంలోనూ ఒకే సమయంలో టీమిండియాకు చెందిన వేర్వేరు జట్లు వేర్వేరు పర్యటనలకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్ జరుగుతున్న సమయంలో శ్రీలంకలో వన్డే, టీ20ల సిరీస్ కోసం ధావన్ నేతృత్వంలోని టీమ్ పాల్గొంది. ఈ ఏడాది కూడా ఇంగ్లండ్‌లో సీనియర్ల టీమ్, ఐర్లాండ్‌లో హార్డిక్ పాండ్యా నేతృత్వంలోని జూనియర్ల టీమ్ ఒకే సమయంలో తలపడ్డాయి.
Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీ ప్రకటనలను నిలిపివేసిన వివో.. కారణం ఏంటంటే..?
కాగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రీలంకలో ఆసియా కప్ జరగనుంది. త్వరలో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ టోర్నీలో భారత్-పాకిస్తాన్ మధ్య ఆగస్టు 28న గ్రూప్ మ్యాచ్ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ టోర్నీ తర్వాత భారత్-పాకిస్తాన్ జట్లు అక్టోబర్ 23న మెల్‌బోర్న్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో మరోసారి తలపడనున్నాయి.