Vladimir Putin : రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మే 7న వరుసగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత మే 9 న రష్యా విజయ దినోత్సవం సందర్భంగా, రెడ్ స్క్వేర్‌లో వేలాది మంది సైనికుల ముందు, పుతిన్ ఉక్రెయిన్‌లో పోరాడుతున్న తన సైన్యాన్ని ప్రశంసించారు.
Nuclear War : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో నాటో దళాలు ప్రవేశించాయి. అమెరికా, ఫ్రెంచ్ మెరైన్ కమాండోలు నేరుగా ఉక్రెయిన్ యుద్ధంలోకి ప్రవేశించారని.. ఇప్పుడు NATO వైమానిక దళ పైలట్లు కూడా సైనిక కార్యకలాపాలను ప్రారంభించవచ్చని రష్యన్ ఇంటెలిజెన్స్ నివేదించింది.
Russia-Ukraine War: రెండేళ్లుగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం సాగుతూనే ఉంది. బలమైన రష్యా ముందు ఉక్రెయిన్ కొన్ని వారాల్లోనే ఓడిపోతుందనే అంచనాల నేపథ్యంలో అమెరికా, వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక సాయంతో రెండేళ్లుగా ఉక్రెయిన్, రష్యాను నిలువరిస్తోంది.
Russia: రష్యా స్వలింగ సంపర్కులపై ఉక్కుపాదం మోపుతోంది. సాంప్రదాయేతర లైంగిక సంబంధాలను ప్రోత్సహించడాన్ని నిషేధించే చట్టాలను ఆమోదించింది. జెండర్‌కి సంబంధించి చట్టపరమైన, వైద్యపరమైన మార్పులను నిషేధించింది. ‘‘LGBT ఉద్యమం’’ని రష్యా తీవ్రవాద, ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది.
Russia: యుద్ధం వద్దన్నందుకు ఓ యువతికి రష్యాలో జైలు శిక్ష విధించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్ వ్యతిరేక ప్రచారానికి నిరసనగా, దేశ అధ్యక్ష ఎన్నికల్లో నిరసగా బ్యాలెట్ పేపర్‌పై ‘నో వార్’ అని రాసింది. దీంతో సెయింట్ పీటర్స్ బర్గ్‌కి చెందిన మహిళకు రష్యా బుధవారం 8 రోజుల జైలు శిక్ష విధించింది. ఇటీవల జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పుతిన్ ఘన విజయం సాధించారు. ఆరేళ్ల పాటు రష్యాకి అధ్యక్షుడిగా ఉండబోతున్నారు.…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలన్స్కీకి ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని ఎక్స్ వేదికగా ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ఫోన్ చేసిన కొన్ని గంటల తర్వాత ప్రధాని జెలన్‌స్కీతో సంభాషించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్-ఉక్రెయిన్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి కోసం కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు తీసుకురావడానికి మద్దతు ఇస్తుందని ప్రధాని, జెలన్స్కీకి తెలియజేశారు. భారతదేశం మానవతా…
PM Modi: రష్యా ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ భారీ విజయం సాధించారు. మరో 6 ఏళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా ఉండేందుకు పుతిన్‌కి అవకాశం లభించింది. అయితే, బుధవారం భారత ప్రధాని నరేంద్రమోడీ, పుతిన్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. ఇరువురు నేతలు, భారత్-రష్యా మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేయాలని అంగీకరించారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
Vinay Kumar: రష్యాలో భారత రాయబారిగా వినయ్ కుమార్‌ని నియమించినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) తెలియజేసింది. ప్రస్తుతం మయన్మార్‌లో భారత రాయబారిగా ఉన్న 1992 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి వినయ్ కుమార్, త్వరలోనే తన బాధ్యతలు చేపడుతారని ఎంఈఏ తెలియజేసింది. ఇటీవల రష్యాలో ఎన్నికలు జరిగాయి, మరోసారి పుతిన్ భారీ మెజారిటీతో రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన గెలుపు తర్వాత ఈ నియామకం చోటు చేసుకుంది.
Ukraine War: రష్యా సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లితే అణ్వాయుధ దాడి తప్పదని పుతిన్ హెచ్చరించాడు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు మాస్కో సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, రష్యా అణుదాడికి పాల్పడుతున్నట్లు ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదని అమెరికా బుధవారం తెలిపింది. ఫిబ్రవరి, 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి అణ్వాయుధాలపై నిర్లక్ష్యంగా మాట్లాడుతోందని అమెరికా ప్రెస్ సెక్రటరీ కరీన్ జిన్ పియర్ అన్నారు.
Russia: ఓ వైపు రెండేళ్లు గడుస్తున్నా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. మరోవైపు ఫిన్లాండ్- రష్యా సరిహద్దుల్లో కూడా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఫిన్లాండ్ సరిహద్దుల్లో తమ దళాలను, స్ట్రైక్ సిస్టమ్‌లను మోహరిస్తామని రష్యా అధినేత పుతిన్ చెప్పినట్లు ఆల్ జజీరా నివేదించింది.