Pakistan: మోడీ పర్యటన ముందు పాక్‌కి రష్యా బంపర్ ఆఫర్.. అయినా ఆ దేశ దరిద్రం తెలిసిందే కదా..
- పాకిస్తాన్‌కి రష్యా బంపర్ ఆఫర్..
- చమురు
- వ్యవసాయంలో సాయం చేస్తామని హామీ..
- వినియోగించుకోలేని పరిస్థితిలో పాకిస్తాన్..
- రష్యాతో వాణిజ్యంపై యూఎస్ కన్నెర్ర చేసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: కజకిస్తాన్ వేదికగా ఎస్‌సీఓ సమ్మిట్ జరుగుతోంది. ఈ సమ్మిట్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పుతిన్ పాకిస్తాన్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే, ఈ ఆఫర్లను పాక్ ఉపయోగించుకుంటుందా..? లేదా..? అనేది ప్రశ్న. ఒక వేళ పాకిస్తాన్, రష్యాతో వాణిజ్యం పెంచుకునే ప్రయత్నం చేస్తే అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి.
బుధవారం రోజును ఇద్దరు నేతల సమావేశం జరిగింది. పాకిస్తాన్‌కి మరింత ఎక్కువ ఇంధన సరఫరా చేసే అవకాశాలపై పుతిన్ చర్చించారు. పుతిన్ షహబాజ్‌తో మాట్లాడుతూ.. ‘‘నేను ముఖ్యంగా రెండు కీలక రంగాలను నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ఇంధనం మరియు వ్యవసాయ-పారిశ్రామిక రంగాలలో సహకారం. మేము పాకిస్తాన్‌కు ఇంధన వనరులను సరఫరా చేయడం ప్రారంభించాము మరియు ఈ సరఫరాను మరింత పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీ అభ్యర్థన మేరకు, పాక్ మార్కెట్‌కు ధాన్యం సరఫరాను పెంచడం ద్వారా పాకిస్థాన్ ఆహార భద్రతకు రష్యా మద్దతు ఇస్తోంది’’ అని బంపర్ ఆఫర్ ఇచ్చారు.
Also Read
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఒకవేళ పాకిస్తాన్ ఈ ఆఫర్‌ని అంగీకరించినా కూడా రష్యాకు చెల్లించడానికి విదేశీ మారక నిల్వలు ఆ దేశం వద్ద లేవు. ప్రస్తుతం 8.9 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో రణాలు చెల్లింపు కారణంగా పాక్ నిల్వలు వేగంగా తగ్గతున్నాయి. ఒకవేళ పాక్ ఈ ఆఫర్ అంగీకరించా కూడా తిప్పలు తప్పేలా లేవు. ఆమెరికా ఆగ్రహం పాక్ చవిచూడాల్సి వస్తుంది.
గతేడాది జూలై నెలలో ఇలాగే ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. దీని కింద పాకిస్తాన్ రష్యా నుంచి ముడి చమురు పొందింది. భారత్‌కి ఇచ్చినట్లే డిస్కౌంట్‌పై తమకు రష్యా ఇస్తోందని పాక్ ప్రధాని ఆ దేశ ప్రజలకు చెప్పారు. అయితే, మొదటి షిప్‌మెంట్ తర్వాత, పాకిస్తాన్ ఎలాంటి ముడి చమురు అందుకోలేదు. పాకిస్తాన్‌కి రష్యా ఎలాంటి తగ్గింపు ఇవ్వలేదని తేలింది.
- Tags
- Pakistan
- PM Modi
- Putin
- Russia
- SCO Summit
తాజావార్తలు
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..