PM Modi Russia Visit: మోడీ రష్యా పర్యటనపై పాశ్చాత్య దేశాల అసూయ.. క్రెమ్లిన్ కామెంట్స్..
- రేపు రష్యా పర్యటనకు ప్రధాని మోడీ..
- మోడీ పర్యటనపై వెస్ట్రన్ దేశాల అసూయ..
- ప్రధాని విజిట్ నేపథ్యంలో క్రెమ్లిన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Russia Visit:ప్రధాని నరేంద్రమోడీ దాదాపుగా 5 ఏళ్ల తర్వాత మిత్రదేశం రష్యా పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటనను రష్యా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మోడీ పర్యటన నేపథ్యంలో రష్యా విస్తృత ఏర్పాట్లను చేస్తోంది. జూలై 8 నుంచి 9 వరకు ప్రధాని మాస్కోలో ఉండనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, మోడీల మధ్య ఇరు దేశాలకు సంబంధించి పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయి.
Read Also: Bear Grylls: “బేర్ గ్రిల్స్” వీడియోలు రక్షించాయి.. అగ్నిపర్వతం నుంచి బయటపడిన సోదరులు..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఇదిలా ఉంటే మోడీ రష్యాలో పర్యటించడాన్ని చూసి వెస్ట్రన్ దేశాలు అసూయ పడుతున్నాయని క్రెమ్లిన్ వ్యాఖ్యానించింది. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్తున్నారు. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రధాని మోడీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. మాస్కోలో ప్రధాని మోడీ కార్యక్రమం విస్తృతంగా ఉంటుందని, ఇరువురు నేతలు అనధికారికంగా చర్చలు జరపొచ్చని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వీజటీఆర్కే టీవీకి శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
రష్యా-భారత సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయిలో ఉన్నాయని, క్రెమ్లిన్‌లో ఇరువురు నేతలు విడిగా చర్చించుకోవడంతో పాటు, ప్రతినిధులతో కూడిన చర్చలు రెండూ జరుగుతాయని ఆయన అన్నారు. ఇది భారత, రష్యా సంబంధాల్లో కీలకమైన పర్యటనగా పెస్కోవ్ అభివర్ణించారు. ప్రధాని మోడీ రాకను పశ్చిమ దేశాలు నిశితంగా, అసూయతో చూస్తున్నాయని పెస్కోవ్ అన్నారు. దాదాపుగా ఐదేళ్ల క్రితం 2019లో ఫార్ ఈస్ట్ సిటీ వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఆర్థిక సమావేశానికి ప్రధాని రష్యాకు వెళ్లారు. ఆ తర్వాత పుతిన్ చివరిసారిగా 2021లో భారత్‌ని సందర్శించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..