Russia: టేకాఫ్ సమయంలో 15 మందితో వెళ్తున్న రష్యన్ IL-76 మిలిటరీ కార్గో విమానం కూలిపోయింది. మాస్కోకు ఈశాన్యంలో ఉన్న ఇవానోవో ప్రాంతంలోని ఎయిర్ ఫీల్డ్ నుంచి టేకాఫ్ అవుతుండగా మంగళవారం విమానం కూలిపోయినట్లుగా రష్యా తెలిపింది. 8 మంది సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో ఉన్న వారంతా మరణించినట్లు సమాచారం.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ దేశ మహిళలపై ప్రశంసలు కురిపించారు. దేశంలో జననాల రేటు పెంచేందుకు రష్యా ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇటీవల పలుమార్లు రష్యా అధినేత మహిళలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. మాతృత్వం, ఆకర్షణ, అందం యొక్క బహుమతులను అందించినందుకు మహిళల్ని ప్రత్యేకంగా వారిని అభినందించారు. మార్చి 8 అనేది సోవియల్ సమయం నుంచి రష్యాలో అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఒకటిగా ఉంది. స్త్రీల గొప్పతనం గురించి వారి నైపుణ్యాల…
Alexei Navalny: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని విమర్శించే వ్యక్తిగా, ప్రతిపక్ష నేతగా గుర్తింపు తెచ్చుకున్న అలెక్సీ నవాల్నీ ఇటీవల జైలులో మరణించాడు. అతడిని పుతిన్ ప్రభుత్వం హత్య చేసినట్లు వెస్ట్రన్ దేశాలు విమర్శిస్తున్నాయి. 30 ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్న ఆయన అనూహ్యరీతిలో ఇటీవల మరణించారు. ఆర్కిటిక్ పీనల్ కాలనీలో వారం క్రితం హఠాత్తుగా మరణించారు. అయితే, ఇప్పటి వరకు అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించలేదు.
Alexei Navalny: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ జైలులో మరణించడంపై వెస్ట్రన్ దేశాలు పుతిన్‌పై భగ్గుమంటున్నాయి. శుక్రవారం నవల్నీ జైలులో మరణించారు. అతని మరణానికి రష్యా అధ్యక్షుడే కారణం అని.. పుతిన్ "కిల్లర్" అంటూ యూరప్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాల్లో ప్రజలు నినదించారు. యూరప్ లోని పలు నగరాల్లో శుక్రవారం పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. ముఖ్యంగా రష్యన్ ఎంబసీల ముందు నిరసన తెలిపారు. నవల్నీది మరణం కాదని హత్య అని ప్లకార్డ్స్…
Baba Vanga: బాబా వంగా గురించి తెలియని వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఈ బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త అంచనా వేసిన భవిష్యత్ సంఘటనలు నిజమవుతున్నాయి. 2024లో ఆమె అంచనా వేసిన సంఘటనలు నిజమవుతున్నాయి. నోస్ట్రాడామస్ ఆఫ్ బాల్కన్స్ అని పిలిచే బాబా వంగా, 9/11 తీవ్రవాద దాడులు, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ విపత్తు మరియు బ్రెక్సిట్ వంటి ప్రధాన ప్రపంచ సంఘటనలను ముందే అంచనా వేశారు. తాజాగా ఆమె అంచనా వేసినట్లు 2024లో జపాన్,…
Breaking News: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ జైలులో మరణించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని తీవ్రస్థాయిలో విమర్శించే వ్యక్తిగా నవల్నీకి గుర్తింపు ఉంది.
ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా జరిగించిన యుద్ధం ఇంకా ప్రపంచం కళ్ల ముందు మెదిలాడుతూనే ఉంది. కొన్ని నెలల పాటు ఉక్రెయిన్‌పై జరిగించిన మారణహోమానికి శిథిలాలు సజీవ సాక్ష్యాలుగా మిగిలాయి.
Putin Praises PM Modi: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. నేటి ప్రపంచంలో అంత సులభం కాని ‘స్వతంత్ర’ విదేశాంగ విధానాన్ని అనుసరించడం భారత్‌కే చెల్లిందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని రష్యా మీడియా నెట్వర్క్ రష్యా టుడే వెల్లడించింది. గురువారం ‘రష్యన్ స్టూడెంట్ డే’ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులతో గురువారం ముచ్చటించారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు. భారతదేశం-రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యా్ని మరింత బలోపేతం చేయడానికి భవిష్యత్ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ఇటీవల అత్యున్నత స్థాయిలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాధినేతలు సమీక్షించారు.
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. తన దేశాన్ని ఉద్దేశిస్తూ న్యూ ఇయర్ ప్రసంగం చేశారు. ఆదివారం ప్రసంగంలో రష్యా సైన్యాన్ని ప్రశంసించారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి స్పష్టంగా ప్రసంగించని ఆయన ఐక్యత కోసం పిలుపునిచ్చారు. గతేడాదికి భిన్నంగా పుతిన్ సైనిక యూనిఫాంలో కనిపించారు. 2024ని ‘ ఇయర్ ఆఫ్ ఫ్యామిలీ’గా అభివర్ణించారు.