దొంగ ఓట్లతో గెలవాలని జగన్ కుట్రలు చేస్తున్నారని.. ఓటర్ల జాబితాలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి తెలిపారు. బీజేపీ సోషల్ మీడియా విభాగంతో బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై పురంధేశ్వరి దిశా నిర్దేశం చేశారు.
విశాఖలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీసీ సామాజిక చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, దగ్గుబాటి పురంధేశ్వరి, సీఎం రమేష్, సత్యకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా.. బీసీ కమిషన్ కు ఎందుకు చట్టబద్ధత కల్పించలేకపోయిందని బీజేపీ ప్రశ్నిస్తోందని తెలిపారు. నా బీసీ కులాలు అనే నైతికత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నామన్నారు.…
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. అంతేకాకుండా.. క్యాడర్ ను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరీ ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.. ఆమే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చేసి వాడుకుంటున్నారని, కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలు ప్రచారం చేసుకుంటున్నారని పురందేశ్వరీ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో మా వ్యూహం మాకు ఉంటుంది.. కేంద్ర అధిష్టానం ఎక్కడినుండి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుండి పోటీ చేస్తానని ప్రకటించారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి..
నాగార్జున సాగర్ నీటిజలాల విడుదల అంశంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు ఎలక్షన్ జరుగుతుంటే సాగర్ నీటి విడుదల ఆలోచన ఓట్ల కోసమేనంటూ ఆమె మండిపడ్డారు. ఘోరాతి ఘోరమైన పని సాగర్ దగ్గర కొనసాగుతుంది..
చెల్లీ! చిన్నమ్మా పురందేశ్వరి! మీరు 'జాతీయ నేత'గా ఉండి 'జాతి నేత'గా ఎందుకు మారారు? అంటూ ప్రశ్నించారు సాయిరెడ్డి.. మీ సొంత ఊరు ప్రకాశం జిల్లా కారంచేడులో మీరు ఇప్పుడున్న పార్టీ బీజేపీ నుండి గత ఎన్నికల్లో సర్పంచ్ లేదా మీ సొంత మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఎందుకు పోటీ పెట్టలేదు? అప్పటికి మీరు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కదా! రాష్ట్రంలో మీ పార్టీలో చిన్న చిన్న నేతలు కూడా నిజాయతీగా అన్ని చోట్ల పోటీ…
పురంధేశ్వరి.. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వచ్చిందన్నారు.. కానీ, ఇప్పుడు ఆ గౌరవం పోవడమే కాదు.. బీజేపీలోనే ఆమెకు మద్దతు లేదన్నారు. ఈ మాత్రం దానికి బీజేపీ అధ్యక్షురాలుగా ఉండటం ఎందుకు? టీడీపీలో చేరితే సరిపోతుంది కదా? అని ప్రశ్నించారు మంత్రి అప్పలరాజు.