Vijayasai Reddy vs Purandeswari: పురంధేశ్వరికి సాయిరెడ్డి కౌంటర్.. ‘జాతీయ నేత’గా ఉండి ‘జాతి నేత’గా ఎందుకు మారారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy vs Purandeswari: బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. తీరికి దొరికితే చాలు ట్వీట్ పెడతాను అనే విధంగా.. వరుసగా ట్వీట్లతో పురంధేశ్వరిపై విరుచుకుపడుతున్నారు.. తాజాగా చేసిన ట్వీట్ల విషయానికి వెళ్తే.. ”చెల్లీ! చిన్నమ్మా పురందేశ్వరి! మీరు ‘జాతీయ నేత’గా ఉండి ‘జాతి నేత’గా ఎందుకు మారారు? అంటూ ప్రశ్నించారు సాయిరెడ్డి.. మీ సొంత ఊరు ప్రకాశం జిల్లా కారంచేడులో మీరు ఇప్పుడున్న పార్టీ బీజేపీ నుండి గత ఎన్నికల్లో సర్పంచ్ లేదా మీ సొంత మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఎందుకు పోటీ పెట్టలేదు? అప్పటికి మీరు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కదా! రాష్ట్రంలో మీ పార్టీలో చిన్న చిన్న నేతలు కూడా నిజాయతీగా అన్ని చోట్ల పోటీ చేశారు. మరి మీరెందుకు ఆ పని చేయలేదు? అంటూ నిలదీశారు.
Read Also: LB Nagar Politics: ప్రచారంపై ప్రత్యేక దృష్టి.. సభలు, రోడ్‌షోలతో హోరెత్తుతున్న ఎల్‌బి నగర్..
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
మీ కార్యకర్తలు ఈ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెబుతారు? అంటూ పురంధేశ్వరిని నిలదీశారు సాయిరెడ్డి.. కొంపదీసి ‘మా బావ కళ్లల్లో ఆనందం కోసం’ అని నిజం చెబుతారా? అని ఎద్దేవా చేశారు. ఇదే కదా మీకు బీజేపీ పట్ల ఉన్న చిత్తశుద్ధి! వెనకటికి ఒకామె.. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అన్నదట! అంటూ పురందేశ్వరిపై సెటైర్లు వేశారు. ఇక, మరో ట్వీట్‌లోకి వెళ్తే.. ”కారంచేడు 145వ పోలింగ్ బూత్ లో బీజీపీకి పడిన 6 ఓట్లలో అసలు పురంధేశ్వరి ఓటు ఉందా? మీ సొంత బీజేపీ అభ్యర్థికి రాష్ట్ర అధ్యక్షులు ఓటు వేయలేదా? మీ బావ పక్షాన పక్షపాతివై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీకు కంటగింపు అయిపోయింది. బీజేపీ లాంటి సిద్ధాంతం ఉన్న పార్టీలో సిద్ధాంతాలు గాలికి వదిలేసే మీరు ఎన్ని రోజులు ఉంటారు? గట్టిగా మాట్లాడితే మా ఓటు అక్కడ లేదు, వైజాగ్ లోనో రాజంపేటలోనో ఉండిపోయింది అని బొంకుతారు మళ్లీ..! అంటూ మరో ట్వీట్‌లో ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇక, తన ట్వీట్లకు కారంచేడులో వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లకు సంబంధించిన లిస్ట్‌ను కూడా జత చేశాడు విజయసాయిరెడ్డి.
1/3: చెల్లీ! చిన్నమ్మా పురందేశ్వరి! మీరు 'జాతీయ నేత'గా ఉండి 'జాతి నేత'గా ఎందుకు మారారు? మీ సొంతఊరు ప్రకాశం జిల్లా కారంచేడులో మీరు ఇప్పుడున్న పార్టీ బిజెపి నుండి గత ఎన్నికల్లో సర్పంచ్ లేదా మీ సొంత మండలంలో MPTC, ZPTCలను ఎందుకు పోటీ పెట్టలేదు? అప్పటికి మీరు పార్టీ జాతీయ ప్రధాన… pic.twitter.com/d4AQPAkhKa
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 15, 2023
కారంచేడు 145వ పోలింగ్ బూత్ లో బీజీపికి పడిన 6 ఓట్లలో అసలు పురందేశ్వరి గారి ఓటు ఉందా? మీ సొంత బిజెపి అభ్యర్థికి రాష్ట్ర అధ్యక్షులు ఓటు వేయలేదా?
మీ బావ పక్షాన పక్షపాతివై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీకు కంటగింపు అయిపోయింది. బిజెపి లాంటి సిద్ధాంతం ఉన్న పార్టీలో సిద్దాంతాలు గాలికి వదిలేసే… pic.twitter.com/dCFECqOAeO— Vijayasai Reddy V (@VSReddy_MP) November 14, 2023
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..