ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 1134 కీలో మీటర్లు నేషనల్ హైవేలను 29,395 కోట్ల రూపాయలతో నిర్మించగా.. వాటిని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. బీజేపీ కూడా పొత్తులపై క్లారిటీ ఇవ్వడంతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ కూడా ఇప్పటి నుంచి ప్రచారంలో దూసుకుపోయేందుకు సిద్ధమైంది.
నెల్లూరు GGHలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెరుగైన పాలన అందించే లక్ష్యంతో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పార్టీ కేంద్ర నాయకత్వానిదే తుది నిర్ణయం అని తెలిపారు. పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగుతానని ఆమె పేర్కొన్నారు.
పారిశ్రామిక వేత్త వల్లగట్ల రెడ్డప్ప ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. మదనపల్లెకు చెందిన పారిశ్రామికవేత్త రెడ్డప్పకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పురంధేశ్వరి. ఈ చేరిక కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి, సోము వీర్రాజు పాల్గొన్నారు.
ప్రస్తుతం పొత్తులపై బీజేపీ అధిష్ఠానం ఏపీ నాయకత్వంతో మాట్లాడే అవకాశం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. అధిష్ఠానం మళ్లీ పిలిస్తేనే ఏపీ బీజేపీ నేతల బృందం చర్చల కోసం వస్తామని చెప్పారు. ఎప్పుడు చర్చల కోసం పిలుస్తారో తెలియదు.. చెప్పలేమన్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశాల్లో పురేంధేశ్వరీ పాల్గొన్నారు. దాదాపు ఏపీ నుంచి 270 మందికి పైగా ప్రతినిధులు వచ్చారు.
ఈ నెల 17వ తేదీన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సహా ఏపీ బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ఎన్నికల సన్నద్ధతపై రెండు రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ సదస్సులో పాల్గొననున్నారు పురంధేశ్వరి, బీజేపీ ముఖ్య నేతలు.. ఇక, బీజేపీ పెద్దలతో ప్రత్యేకంగా పురంధేశ్వరి సమావేశం కానున్నారు.. పొత్తులు.. సీట్ల సర్దుబాటుపై హైకమాండ్‌తో ఏపీ బీజేపీ చీఫ్ చర్చిస్తారని తెలుస్తోంది..
ఏపీలో పవన్ కళ్యాణ్‌తో బీజేపీకి పొత్తు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. పొత్తులపై నిర్ణయం అధిష్ఠానానిదే అని ఆమె చెప్పారు.జనసేనతో బంధుత్వం లేదు అని అధిష్టానం చెపితే లేనట్టేనని.. పవన్‌తో బంధుత్వంపై అధిష్టానం చెపితే మీకూ చెపుతామని మీడియా ముందు పురంధేశ్వరి తెలిపారు.
గుంటూరులో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించింది. ఈ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొని, ప్రసంగించారు. కార్యకర్తల శ్రమతోనే బీజేపీ పార్టీ ఎదిగిందని తెలిపారు. రాష్ట్రానికి 22 లక్షల ఇళ్ళు కేంద్రం మంజూరు చేసిందని అన్నారు. కాగా.. బీజేపీ పార్టీ భాగస్వామ్యంతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కాగా.. రాజధాని లేని రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు. రాజధాని విషయంలో టీడీపీ డిజైన్లతో కాలక్షేపం చేస్తే వైసీపీ మూడుముక్కల ఆట ఆడుతోందని ఆరోపించారు. రాజధాని…