ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చానని రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ అంటున్నారు. బీసీలకు అత్యధిక స్థానాలను ఇచ్చిన పార్టీ వైసీపీ అని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. ఇది హేయమైన చర్య అని ఆమె ఖండించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసినప్పుడు ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అంటూ ఆమె తెలిపారు.
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మే 13తర్వాత రాష్ట్రంలో మార్పు మొదలు అవుతుందని, మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ ఎన్ డి ఏ కూటమికి మద్ధత్తు పలకాలన్నారు. దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులను ఎన్నికల విధుల్లో తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందన్నారు. వచ్చేది వుత్తరాయనం పండుగలు సీజన్ కాబట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా…
టీడీపీ అధినేత చంద్రబాబును కాపాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పురంధేశ్వరి బీజేపీ నేతగా కంటే చంద్రబాబుకు మేలు చేసేలా పని చేస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల సందర్భంలో పింఛన్ పంపిణీని ఎందుకు రాజకీయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు. సంక్షేమం అనేది నిరంతరాయం.. అందుకు తగిన విధంగా ప్రభుత్వం ఎందుకు సన్నద్దంగా లేదని అడిగారు. మొత్తం వ్యవహారాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసి, మీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునే విధంగా మీ వైఖరి కనపడుతోందని ఆరోపించారు. సమర్ధవంతంగా పింఛన్ అందించడానికి అవసరమైన విధానాలు ఎందుకు రూపొందించుకోలేదని ప్రశ్నించారు.
బీజేపీ కేంద్ర అధిష్ఠానం నిర్ణయం మేరకే టికెట్ల కేటాయింపు జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. రాజమండ్రిలో ఆమె టికెట్ల కేటాయింపుపై వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానం నిర్ణయాన్ని బీజేపీ కార్యకర్తలు అంతా గౌరవిస్తున్నారన్నారు.