పురంధేశ్వరికి నెల్లూరులో ఎన్ని కాలువలు ఉన్నాయో తెలీదు..
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భూములకు హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీనివల్ల 20 ఏళ్లుగా భూమిని సాగు చేస్తున్న వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో కరవు మండలాలను ఏ విధంగా ప్రకటిస్తారనే విషయం టీడీపీ నేతలకు అర్థం కావడం లేదన్నారు. దీనికి కేంద్ర మార్గదర్శకాలు ఉన్నాయన్న మంత్రి.. ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని కరవును నిర్దారిస్తారన్నారు. ఈ నిబంధనలకు అనుగుణంగా కరవు మండలాలను ప్రకటించారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. కానీ కొన్ని మీడియాలలో మాత్రం నిత్యం ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ సంక్షేమ పథకాలు కరీంనగర్ వేదికగా ప్రకటించుకున్నాం
కరీంనగర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ చరిత్రకి ఈ ఎస్సారార్ కళాశాల కి ఒక ప్రత్యేకత ఉందన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలు కరీంనగర్ వేదికగా ప్రకటించుకున్నామని, కాంగ్రెస్ పార్టీ డోకాబాజ్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. 1969 లో నాలుగు వందల మందిని పొట్టన పెట్టుకున్నారని, కేసీఆర్ చచ్చుడో అని అమరణ నిరాహార దీక్షకి కూడా ఇక్కడనే బీజం అయ్యిందన్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ పాలనలో తలసరి అదాయం ఇండియాలో నంబర్ వన్ లో ఉన్నామని, విద్యుత్ వినియోగం లో మనమే నంబర్ వన్ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
కరెంట్ కోసం కాంగ్రెస్ పాలనలో కాలరాత్రిలే
మంచిర్యాల జన్నారంలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అనాడు కరెంట్ ఉంటే వార్త… ఇప్పుడు కరెంట్ పొతే వార్త అని ఆయన అన్నారు. కరెంట్ కోసం కాంగ్రెస్ పాలన లో కాల రాత్రి లే అని మంత్రి కేటీఆర్ అన్నారు. కరెంట్ చూపించు అని రేవంత్ రెడ్డి అంటున్నారని, కరెంట్ కనబడదు.. కాంగ్రెస్ వాళ్ళు వైర్లు పట్టుకోండన్నారు మంత్రి కేటీఆర్. ఏం పార్టీ..కాంగ్రెస్ పార్టీ .. వందల మందిని చంపిన కాంగ్రెస్ ను మన నెత్తిన పెట్టుకుందామా అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క ఛాన్స్ కాదు.. 11 ఛాన్స్ ఇచ్చారు .. ఏం చేసారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నోటికి ఎంత అంతే మాట్లాడుతున్నారని, 2 వందలు పెన్షన్ ఇవ్వని కాంగ్రెస్ ఇప్పుడు 4 వేలు ఇస్తారా అని మంత్రి కేటీఆర్ అన్నారు.
దళిత సంక్షేమాన్ని అపహాస్యం చేసింది చంద్రబాబే..
ఉద్యమాలతో సంబంధం లేకుండా అసైన్డ్ భూములు పేదలకు సీఎం జగన్ ఇచ్చారని మంత్రి మెరుగు నాగార్జున పేర్కొన్నారు. లంక భూములు, చుక్కల భూములు ఇలా అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయన్నారు. ఇవాళ ఎస్సీలకు సంబంధించి ఎప్పుడో ఇచ్చిన పట్టాలు ఇప్పుడు మళ్ళీ దళితులకు చెందేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. దళిత యువకుడు చనిపోతే వెంటనే సీఎం స్పందించి కుటుంబానికి అండగా ఉండమని సీఎం జగన్ చెప్పారన్నారు. బూతులు మాట్లాడ్డం మాక్కూడా వచ్చన్నారు. సీఎం జగన్ దళిత యువకుడి మృతిపై వెంటనే స్పందిస్తే.. రాజకీయాల్లో వెనకబడ్డ వారు జగన్ పట్టించుకోలేదని విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో దళిత సంక్షేమాన్ని అపహాస్యం చేసింది చంద్రబాబేనని మంత్రి మెరుగు నాగార్జున స్పష్టం చేశారు. చంద్రబాబుకు చెంచా గిరి చేసే వాళ్ళు మా మంత్రులను ఎమ్మెల్యేలను విమర్శలు చేస్తే ఊరుకోమన్నారు.
ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే కాంగ్రెస్
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లలో జరిగిన పని ప్రతి ఊరిలో, పట్టణంలో మీకు కనిపిస్తుందని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. 58 ఏళ్లు గొడగొడ ఏడ్చినం. కరువుతో వలసలు పోయినమని, ఇదే నియోజకవర్గానికి చెందిన రాంచంద్రపూరంలో ఓ రైతు బోర్లు వేసి నీళ్లు పడక అక్కడే చనిపోయాడన్నారు సీఎం కేసీఆర్.
అంతేకాకుండా..’తాగు, సాగునీరు లేదు. కరెంటు లేని రోజులు చూసాం. కొండగట్టుఅంజన్న కొలువైన నియోజకవర్గం చొప్పదండి. ఈ మధ్యనే అక్కడి వచ్చాను. ప్లాన్లు రెఢీ చేస్తున్నాం. వెయ్యి కోట్లైనా సరే ఖర్చు చేసి కొండగట్టుఆలయాన్ని బ్రహ్మాండగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, ఇంకోవైపు రైతుల బాధలు పొయేలా మనం ప్రణాళికలు రచించుకుని ముందుకు పోతున్నాం. భారతదేశంలోనే ఏ పార్టీ చేయని విధంగా రైతుబంధు పేరుతో రైతులకు పెట్టుబడి, దురదృష్టవాశాత్తు రైతు చనిపోతే రైతుబీమా ఇస్తున్నాం. ఇక్కడ వరదకాలువ, కాకతీయ కాలువ ఉన్నా ఎన్ని ఎకరాలకు నీరందేదో తెలుసా? వరదకాలువకు మోటార్లు పెడితే అప్పట్లో ఆ మోటర్లను తీసి నీళ్లలో పారేసేవాళ్లు. ఇప్పుడా బాధ ఉందా? కరెంట్ 3 గంటలు చాలట. అందుకోసం 10 హెచ్.పి. మోటార్ పెట్టుకోవాల్నట. మీకు 24 గంటలు కావాలా…? 3 గంటలు కావాలా? ఎన్నిగంటలిచ్చే పార్టీ గెలవాలో మీరే నిర్ణయించాలి. రైతుబంధు వేస్ట్ అనే పార్టీ కావాలా? ఇచ్చే పార్టీ కావాలా? రవిశంకర్ ను గెలిపిస్తే రైతు బంధు 16 వేలకు తీసుకుపోతాం. గ్రామాలలో మరో డేంజర్… ధరణిని తీసేస్తరట. తీసేస్తే మీ భూములకు రక్షణ ఉండదు. ఇయ్యాల మరో పథకం తెస్తామని మళ్ళీ మానిఫెస్టోలో చెప్పారు.
‘తలైవా 171’ షూటింగ్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్..
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది జైలర్ చిత్రంతో తిరుగులేని విజయం అందుకున్నారు. జైలర్ సినిమా రజనీ కి కమ్ బ్యాక్ ఫిల్మ్ గా నిలిచిపోయింది..ప్రస్తుతం రజనీకాంత్ తలైవా 170 సినిమా తో బిజీగా ఉన్నారు.. జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశ లో ఉంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం లో తలైవా 171 సినిమాకు కూడా రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఖైదీ, విక్రమ్, లియో లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల ను తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్-రజినీకాంత్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని ఎప్పుడు స్టార్ట్ అవుతుందా.. ఎప్పుడు అప్‌డేట్‌లు ఇస్తారా అని ఫ్యాన్స్ ఎంతో ఎక్జయిటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఒక సాలిడ్ అప్‌డేట్ వచ్చింది.
అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ తెలంగాణ
అంబర్‌పేట నియోజకవర్గంలో అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారంలో ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లేలా నేతలు ప్రణాళికలు రచించి బీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ ప్రచారాల్లో జోరు పెంచారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై పలువురు బీజేపీ సీనియర్ నాయకులు ఈరోజు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారని కాలేరు వెంకటేష్ తెలిపారు. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ.. అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశాలను ప్రజలకు తన దైన శైలిలో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేశ్, స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ సహా వందలాది గులాబీ దండుతో కలిసి అంబర్‌పేట్ డివిజన్ బాపు నగర్ సాయిబాబా టెంపుల్ నుంచి ప్రారంభించి ప్రేమ్ నగర్, చెన్నారెడ్డి నగర్, పలు బస్తీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ తెలంగాణ అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కండ్లలా భావించి సీఎం కేసీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారన్నారు.
ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్‌ఎస్సే
గజ్వేల్‌లో మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్‌ఎస్సే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మూడు గంటల కరెంట్ చాలు అంటున్న కాంగ్రెస్ ను ఓడించాలని, బీజేపీ, కాంగ్రెస్ కు ఓటు వేసి రిస్క్ తీసుకోవద్దన్నారు. అవసరానికి వచ్చి కొందరు వరుసలు కలుపుతున్నారని, బీజేపీ వాళ్ళకి ఓటు వేస్తే మురిగి పోయినట్టేనన్నారు. కేసీఆర్ ను తిప్పలు పెట్టేందుకు నొట్ల కట్టలు తెచ్చి పంచుతారట.. 14 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. మిగిలిన మరో 4 వేల కోట్లు ఎన్నికల కమిషన్ అనుమతి రాగానే వారంలో వేస్తామన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. 2009 లో పెట్టిన మేనిఫెస్టో లో పెట్టిన హామీలు ఒక్కటి కూడా నేరవేర్చలేదని, ఈ రోజు కాంగ్రెస్ 42 పేజీల మేనిఫెస్టోని ప్రవేశపెట్టిందన్నారు మంత్రి హరీష్ రావు.
సీఎం జగన్ సర్కారును చూసి బీజేపీ, జనసేన, టీడీపీ భయపడుతున్నాయి..
సీఎం జగన్ ప్రభుత్వాన్ని చూసి బీజేపీ, జనసేన, టీడీపీ భయపడుతున్నాయని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రతిపక్షాల సంక్షేమం అభివృద్ధిపై గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. పురంధేశ్వరి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఆయన అన్నారు. నిధులంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు పురంధేశ్వరి బిల్డప్ ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. లోకేష్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా పూర్తి రీయింబర్స్ విడుదల చేశారా అని ఆయన ప్రశ్నించారు. నారాయణ, చైతన్య కళాశాలలకు టీడీపీ కొమ్ము కాసిందన్నారు. పేదవాళ్లు స్కూల్‌కెళ్లి చదువుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ఒక అడుగున ముందుకు వేసిందా అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను టీడీపీ నేతలు కాపీ కొడుతున్నారన్నారు.
పచ్చ పార్టీకి కాపలా కాయడం ఆమెకు మాత్రమే సాధ్యం
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతి రోజు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ఈ సందర్భంగా మరోసారి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా సెటైర్ వేశారు.”జగన్ ప్రభుత్వం సమగ్ర కులగణనకు శ్రీకారం చుట్టింది. దీనికి మీరు అనుకూలమా… వ్యతిరేకమా పురంధేశ్వరి గారూ? వేల కోట్ల ప్రజాధనం దోచుకున్న చంద్రబాబు గారి ప్రయోజనాలే మీకు ముఖ్యం కదా. ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు? బీసీలు జడ్జిలుగా పనికిరారు. వారి తోకలు కత్తిరించాలనేది చంద్రబాబు పాలసీ. మీ విధానం కూడా అదేనేమో?” అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి
రోజురోజుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన రావడంతో నేతల్లో అసంతృప్తులు, పార్టీల మార్పులతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల ఆమె బీజేపీకి పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆమె తిరిగి తన సొంతగూటికే చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. అవే నిజం చేస్తూ శుక్రవారం విజయ శాంతి హస్తం పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న గాంధీభవన్‌లో మల్లికార్జున ఖర్గే.. ఆమెకు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు విజయశాంతి ట్వీట్ చేశారు. ‘ఎంతో ఆదరణతో, సమున్నతమైన గౌరవంతో స్వాగతించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు..’ అంటూ తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కాగా మెదక్ లోక్ సభ సీటు హామీతోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75సంవత్సరాలు అయిన ఇంకా పరిణితి రాలేదన్నారు. ఏ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉందో అవి అభివృద్ధి చెందాయని, ఎమ్మెల్యే గురించి ప్రజలు ఆలోచన చేయాలన్నారు సీఎం కేసీఆర్. గుణ, గణాలు, మంచి చెడు చూడాలని, ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మిగితా రెండు పార్టీల చరిత్ర గురించి ఆలోచన చేయాలని, మంది మాటలు పట్టుకొని మార్వానం పోతే మల్ల వచ్చే వరకు ఇల్లు కాలిందంట అంటూ ఆయన ప్రత్యర్థ పార్టీలపై సెటైర్లు వేశారు.
దళిత యువకుడి ఆత్మహత్యపై సీఐడీ విచారణకు ఆదేశిస్తాం..
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన మహేంద్ర ఆత్మహత్య ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించనున్నట్లు హోం మంత్రి తానేటి వనిత వెల్లడించారు. ఈ ఘటనక తనకు ఎటువంటి సంబంధం లేదని, కావాలనే తన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మహేంద్ర ఆసుపత్రిలో జాయిన్ అయిన దగ్గర్నుంచి వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించాలని డాక్టర్లకి సూచించానని అన్నారు. కొవ్వూరులో హోంమంత్రి తానేటి వనిత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి సీఐడీ ఎంక్వయిరీ వేయమని కోరినట్లు తెలిపారు. సీఐడీ ఎంక్వయిరీకి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ ఎంక్వైరీలో మహేంద్ర మృతి వెనక నిజ నిజాలు నిగ్గు తేలతాయని అన్నారు. జనసేన పార్టీకి చెందిన నాయకులు దురుద్దేశంతో ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కుంభకోణంతో మునిగిపోయింది
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎంతోమంది స్వప్నం తెలంగాణ… సోనియాగాంధీ సాకారం చేశారన్నారు. కానీ ఎందరో స్వప్నం ఒక్క కుటుంబానికి లబ్ది చేకూర్చిందన్నారు రాహుల్ గాంధీ. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కుంభకోణం తో మునిగిపోయిందన్నారు. ప్రాజెక్ట్ నీ నేను స్వయంగా చూసానని, మీ భూమి నీ మీ దగ్గర నుంచి లాగేసుకున్నారన్నారు రాహుల్ గాంధీ. కేసీఆర్ కాంగ్రెస్ ఏం చేసింది అని అడుగుతుంది… కెసిఆర్ జి మీరు చదువుకున్న స్కూల్, కాలేజి, యూనివర్సిటీ కాంగ్రెస్ నిర్మించిందన్నారు రాహుల్ గాంధీ. మేము తెలంగాణ ప్రజలకు 6 వాగ్దానాలు చేస్తున్నామని, వంట Gas నీ మీరు ఇప్పుడు 1200 కి కొంటున్నారు… మేము అధికారంలోకి రాగానే గ్యాస్ 500 కే ఇవ్వబోతున్నమన్నారు రాహుల్ గాంధీ.