విశాఖలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీసీ సామాజిక చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, దగ్గుబాటి పురంధేశ్వరి, సీఎం రమేష్, సత్యకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా.. బీసీ కమిషన్ కు ఎందుకు చట్టబద్ధత కల్పించలేకపోయిందని బీజేపీ ప్రశ్నిస్తోందని తెలిపారు. నా బీసీ కులాలు అనే నైతికత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నామన్నారు. బీసీల సంక్షేమానికి అంకితమైన వారిని గుర్తించాలని పురంధేశ్వరీ కోరారు.
HanuMan Mega Pre Release Utsav LIVE : హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్
బీసీని దేశ ప్రధానిని చేయడం బీజేపీతోనే సాధ్యపడిందని పురంధేశ్వరీ తెలిపారు. అట్టడుగు వర్గాల సేవకు బీజేపీ అంకితం అయ్యిందని పేర్కొన్నారు. బీసీ కమిషన్ కు చట్ట బద్దత కల్పించిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని పురంధేశ్వరీ కొనియాడారు. రాజు అనే వాడు తనకు ఇష్టమైనది కాదు ప్రజాభీష్టానికి అనుగుణంగా పని చేయాలని పురంధేశ్వరీ అన్నారు.
Ambati Rambabu: ఆంబోతులంటూ మాపై చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదు..
మరోవైపు వై. సత్యకుమార్ మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీలు రెండోసారి అధికారంలోకి రావాలంటే తలకిందులుగా తపస్సు చేయాలిసిందేనని ఆరోపించారు. బూటకపు మాటలు చెప్పే పార్టీలు తిరస్కరణకు గురవుతున్నాయని తెలిపారు. బీసీల ఆశీర్వాదంతో గెలిచిన జగన్.. ఎన్నికల తర్వాత బోడి మల్లయ్య అంటున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు మళ్లీ బీసీలు జపం చేస్తూ సామాజిక బస్సుయాత్రలు చేస్తున్నా జనం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 56 బీసీ కార్పొరేషన్ల ద్వారా 56 రూపాయలైన రుణాల రూపంలో వచ్చాయా అని ప్రశ్నించారు.