నాగార్జున సాగర్ నీటిజలాల విడుదల అంశంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు ఎలక్షన్ జరుగుతుంటే సాగర్ నీటి విడుదల ఆలోచన ఓట్ల కోసమేనంటూ ఆమె మండిపడ్డారు. ఘోరాతి ఘోరమైన పని సాగర్ దగ్గర కొనసాగుతుంది.. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ సెంట్రల్ ఫోర్సులతో సహా ఘర్షణ పడ్డారు.. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికే ఈ చర్య అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు వందల మండలాల్లో కరువు ఉంటే వంద మండలాలకే పరిమితం చేసారు అని పురంధేశ్వర ఆరోపించారు. కరువు గురించి అధికారులు చెప్పినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. వ్యవసాయ శాఖామంత్రి అంటే ఎవరు అనేది ప్రజలు వెతుక్కుంటున్నారు.. ఇరిగేషన్ మంత్రి ఎవరు అంటే ఆయన భాషా శైలి వల్ల తెలుస్తూనే ఉంది అని ఆమె మండిపడ్డారు.