ర్తెతులకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా మోసం చేసిన సీఎం జగన్ బటన్ నొక్కడం కూడా మోసగించడమేనంటూ ఆమె మండిపడ్డారు. నా మీద చేసే విమర్శలు డ్తెవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అని పురంధేశ్వరి తెలిపారు.
విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తన పైన ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విషయంలో 10 ఏళ్లకు పైగా బెయిల్‌లో కొనసాగుతున్నారు. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ.. న్యాయ వ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధిస్తున్నారు. విజయసాయి రెడ్డి వ్యవహరంపై విచారణ చేయాలి.. విజయసాయి రెడ్డే కాదు.. వైఎస్ జగన్ కూడా పదేళ్ల నుంచి బెయిల్ మీదే ఉన్నారు అంటూ ఆమె సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి
కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.. కానీ, ఆ విషయం ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు ? అని నిలదీశారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం జీవితం అందరికీ స్పూర్తి.. ప్రస్తుతం కులాలు మతాలను రాజకీయాల కోసం విభజిస్తున్న పరిస్థితి నెలకొంది అని ఆమె అన్నారు.