Purandeswari: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన పార్టీలతో పొత్తు ఖరారు చేసుకున్న భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక పూర్తి అయినట్టు తెలుస్తుండగా.. ఆ లిస్ట్‌ను బీజేపీ అధిష్టానం ఫైనల్ చేయాల్సి ఉంది.. ఇప్పుడు అందుకోసమే ఢిల్లీ బాట పట్టారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి.. తన పర్యటనలో బీజేపీ జాతీయ నేతలతో ఆమె సమావేశం కానున్నారు.. వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై బీజేపీ అధిష్టానంతో చర్చించనున్నారు పురంధేశ్వరి.. ఇప్పటికే సిద్ధం చేసిన ప్రతిపాదనలను హైకమాండ్ ముందు ఉంచి.. లాభనష్టాలను బేరీజు వేసి.. అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు..
Read Also: Gadchiroli Encounter: భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి!
కాగా, టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తులు ఖరారు అయిన తర్వాత.. సీట్లపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది.. ఏ పార్టీ ఎన్ని స్థానాలు, ఏఏ స్థానాలు అనేదానిపై క్లారిటీ వచ్చినా.. అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.. ఇప్పటికే టీడీపీ మెజార్టీ స్థానాలను ప్రకటించింది.. జనసేన కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.. ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఆమోదం తర్వాత.. ఒకేసారి అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు. కాగా, ఏపీలో 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్న బీజేపీ.. 10 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగనున్న విషయం విదితమే.. మరోవైపు.. టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడిగా ఓ భారీ బహిరంగ సభను కూడా నిర్వహించాయి.. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభలో పాల్గొని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన విషయం విదితమే.