నెల్లూరు GGHలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెరుగైన పాలన అందించే లక్ష్యంతో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పార్టీ కేంద్ర నాయకత్వానిదే తుది నిర్ణయం అని తెలిపారు. పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగుతానని ఆమె పేర్కొన్నారు.
Ambati Rambabu: పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి సెటైర్లు..
ఇదిలా ఉంటే.. నరేంద్ర మోడీ అందించిన సుపరిపాలనను ప్రజల్లోకి కార్యకర్తలు తీసుకువెళ్లాలని పురంధేశ్వరీ కోరారు. ప్రధాని మోడీ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు.. వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకువచ్చారని అన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో పాలన అధ్వానంగా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలపై అప్పుల భారాన్ని మోపారని మండిపడ్డారు. అప్పులు తీసుకోవడానికి సెక్రటేరియట్ ను కూడా.. తనఖాగా పెట్టి 350 కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నారని తెలిపారు. దేవాలయంగా భావించే సెక్రటేరియట్ ను ఇలా చేయడం బాధాకరం.. గనులను కూడా తాకట్టుపెట్టి వేల కోట్లను అప్పుగా తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలనకు చరమగీతం పాడేలా బీజేపీ కార్యకర్తలు పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Congress: అరుణాచల్‌ప్రదేశ్ పీసీసీ చీఫ్ రాజీనామా